Medak

News May 9, 2024

సంగారెడ్డి: ముళ్లపొదల్లో పసికందు మృతదేహం

image

సంగారెడ్డి జిల్లాలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామ శివారులో రోడ్డు పక్కన ముళ్లపొదల్లో పసికందు మృతదేహాన్ని దుండగులు వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News May 9, 2024

సిద్దిపేట: దారుణం.. తండ్రిని చంపేశాడు.. !

image

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం హైమద్ నగర్‌లో దారుణం జరిగింది. మద్యానికి బానిసగా మారిన పటాన్ ఫరూక్(35) మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహంతో తన తండ్రి వల్లిఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో వల్లిఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలీంచి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News May 9, 2024

పోలీసులు అతిగా పోవద్దు.. వచ్చేది మా ప్రభుత్వమే: KCR

image

పోలీసులు అతిగా పోవద్దని, వచ్చేది మా ప్రభుత్వమేనని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాత్రి పటాన్‌చెరు పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో BRS అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రసంగించారు. పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తించాలని, రాజకీయాల్లో వేలు పెట్టొద్దన్నారు. తెలంగాణ కోసం నా ప్రాణమైన బలి పెడతాను కానీ అన్యాయం జరగనీయం అన్నారు. బడే బాయ్ చోటే బాయ్ కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.

News May 9, 2024

MDK: రైలు ఢీకొని కామారెడ్డి యువకుడి మృతి

image

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని <<13209937>>రైలు ఢీకొట్టిన<<>> ఘటనలో మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మాలోత్ ప్రకాశ్‌గా గుర్తించారు. తన సొంత పనులపై బైక్‌పై మెదక్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ప్రకాశ్ బంధువుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 9, 2024

ఇండియా కూటమి వైపే ప్రజలు: జగ్గారెడ్డి

image

దేశంలో జరిగిన 50% ఓటింగ్‌లో ఇండియా కూటమి వైపే ప్రజల మొగ్గు చూపినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బంగారం ధర తగ్గుతుందని చెప్పారు. రాహుల్ కుటుంబ త్యాగం ముందు మోదీ, అమిత్ షా రాజకీయం జీరో అని తెలిపారు.

News May 9, 2024

నేడు నర్సాపూర్ రానున్న రాహుల్ గాంధీ

image

నర్సాపూర్ పట్టణానికి నేడు సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. నర్సాపూర్ పట్టణ సమీపంలోని వెల్దుర్తి మార్గంలోని ఖాళీ ప్రదేశంలో సభకు ఏర్పాట్లు చేశారు. సభా ఏర్పాట్లను మంత్రి కొండ సురేఖ, ఏఐసీసీ ఇన్‌ఛార్జీ సురేశ్ తదితరులు పరిశీలించారు. భారీగా జనసమీకరణకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు.

News May 9, 2024

“కొకపేటలో భూములు కొనడానికి డబ్బులు ఎక్కడివి “

image

మోదీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు కారుకు పంక్చర్ చేయడంతో పాటు కాళేశ్వరంలో ముంచారని మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బుధవారం వర్గల్ మండల కేంద్రంలో రోడ్ షో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రజలను వంచించి కోట్లు కొల్లగొట్టారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కొకపేటలో రూ.వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టి భూములు కొనడానికి డబ్బు ఎక్కడివని ప్రశ్నించారు.

News May 8, 2024

కామారెడ్డి‌లో ఓడిన కేసీఆర్.. ఎంపీలను ఎలా గెలిపిస్తాడు.?: రఘునందన్ రావు

image

కామారెడ్డిలో ఓడిన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్లలో ఏ మొఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నాడని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘునందన్‌రావు మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ దుబ్బాకలో చెల్లని నోటు మెదక్‌లో చెల్లుతుందా అని చేసిన వాక్యలపై ఆయన మండిపడ్డారు. బీజేపీ చేతిలో ఓడిన కేసీఆర్ BRS ఎంపీలను ఎట్లా గెలిపిస్తాడని ప్రశ్నించారు.

News May 8, 2024

సిద్దిపేట: పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

image

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. ఈనెల 13న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రత్యేక బలగాల అధికారులతో సిద్దిపేట పోలీస్ కమిషనర్ తన కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహన తనిఖీలు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 8, 2024

దుబ్బాక: ఇంటి గోడలకు నీళ్లు కొడుతుండగా.. కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటికి నీరు పడుతున్న క్రమంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం పెద్దచీకోడ్ గ్రామంలో జరిగింది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు కొత్త ఇళ్లు కట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గోడలకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.