Medak

News May 31, 2024

సిద్దిపేట: అట్రాసిటీ కేసు.. 14 రోజుల రిమాండ్

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముగ్గురు నిందితులకు సిద్దిపేట కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చందన 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లిలో ఈనెల 28న ఎస్సీ వర్గానికి చెందిన హనుమాన్ మాలదారులు ఆలయంలోకి వెళ్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారికి రిమాండ్‌‌కు తరలించారు.

News May 31, 2024

మెతుకుసీమ ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి !

image

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడటంతో ఉమ్మడి జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. MDK, ZHBలో విజయంపై పార్టీల నేతలు ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో మెదక్‌లో గెలుపు మాదంటే మాదే అని నాయకులు సవాళ్లు చేసుకుంటున్నారు. మెదక్‌లో ముక్కోణపు పోటీ నెలకొనడంతోపాటు మాజీ సీఎం కేసీఆర్ సొంత ఇలాకా కావడంతో మెతుకుసీమ ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తుది ఫలితాల కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే.

News May 31, 2024

SRD: ‘టీచర్ల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలి’

image

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ పరిధిలోని సంఘ భవనంలో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు రావలసిన నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు నాయకులు పాల్గొన్నారు.

News May 31, 2024

మెదక్: నీటి కుంటలో మహిళా మృతదేహం

image

నార్సింగి 44వ జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని మహిళా మృతదేహం కలకలం రేపింది. రోడ్డు పక్కన నీటి కుంటలో సుమారు 40-45 సంవత్సరాల వయసు గల మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు మృతురాలు ఎవరు, ఎలా చనిపోయారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 31, 2024

MDK: ట్రిపుల్​ ఆర్ బాధితులకు పరిహారం టెన్షన్

image

రీజనల్​ రింగ్​రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులను సరైన పరిహారం అందుతుందాలేదా అన్న టెన్షన్​ వెంటాడుతోంది. ఇప్పటికే త్రీ డీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సేకరిస్తున్న భూములకు ఎకరానికి రూ.6 నుంచి 8లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్టు ప్రచారమవుతోంది. దీనికోసం 962.27 ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన అధికారులు మార్కింగ్ చేశారు. పలు గ్రామాల్లో 1,168 మంది రైతుల భూములను సేకరించనున్నారు.

News May 31, 2024

అందుబాటులో విత్తనాలు.. ఆందోళన వద్దు: కలెక్టర్

image

కౌడిపల్లి మండలం నాగ్ సాన్ పల్లి గ్రామంలో డిసిఎంఎస్ ద్వారా విక్రయిస్తున్న పచ్చిరొట్ట విత్తనాల షాపును కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. రైతులకు సరిపడా జీలుగు, జానుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆందోళన చెందవద్దని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3 లక్షల 73 వేల 500 ఎకరాలలో వరి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినట్టు కలెక్టర్ తెలిపారు.

News May 30, 2024

గజ్వేల్: అనుమానాస్పదంగా యువకుడి మృతి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన వడ్ల నరేశ్ చారీ ఆయన ఇంటి ముందు ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెంది పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న గజ్వేల్ సీఐ సైదా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా మృతుడుది హత్యగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News May 30, 2024

బడి బాటను విజయవంతం చేయాలి: వల్లూరి క్రాంతి

image

జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పాలనాధికారి వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సంబంధిత బడిబాట సమన్వయ సమావేశంలో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేయాల్సిన పనులను వివరించారు. జేసీ చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, సీఎంఓ వెంకటేశం అన్ని విభాగాల అధికారులు, ఎంఈఓ, హెచ్ఎంలు పాల్గొన్నారు.

News May 30, 2024

నర్సాపూర్: భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్

image

భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని దోబీగల్లీలో నివాసముంటున్న ప్రశాంత్‌కు గత నెలలో రామంతపూర్ చెందిన యువతితో వివాహం జరిగింది. ఈనెల 17న పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్.. గత రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. తల్లి నరసమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News May 30, 2024

సంగారెడ్డి: నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

image

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వతరణ దినోత్సవ ఏర్పాట్లపై గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.