Medak

News May 16, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల బీఈ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చెల్లించి ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 25వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందాలనుకునే వారు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చెల్లించి 25లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 16, 2024

నర్సాపూర్: ఏసీబీ వలలో మరో వ్యవసాయ అధికారి

image

ఏసీబీ వలకు నర్సాపూర్ పట్టణ వ్యవసాయాధికారి గురువారం చిక్కాడు. రూ.30 వేల లంచం తీసుకుంటున్న నర్సాపూర్ మండలం వ్యవసాయ అధికారి అనిల్ కుమార్‌ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో పట్టుకుని విచారణ చేపట్టారు. నర్సాపూర్‌లో ఒక అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేయగా సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఇటీవలి కాలంలో మెదక్ జిల్లాలో పలువురు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కారు.

News May 16, 2024

UK పార్లమెంట్ బరిలో సిద్దిపేట జిల్లా వాసి

image

సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరం వాసి నాగరాజు ఉదయ్ UK పార్లమెంట్ బరిలో నిలిచారు. యూకేలోని లండన్ యూనివర్సిటీలో పాలనాశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ స్థానం నుంచి ఆయన పోటీ పడనున్నారు. నాగరాజు మాజీ ప్రధాని పీవీ నరసింగరావుకు బంధువు. కొహెడ మండల వాసి యూకే పార్లమెంట్ బరిలో నిలవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News May 16, 2024

సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సాగుకు సమాయత్తం

image

వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ పంటల సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఏ పంట ఎంత మేరకు సాగు కానున్నది. ఇందుకు అనుగుణంగా ఏ రకం విత్తనాలు ఎంత మేరకు అవసరం అవుతాయని అంచనాలను రూపొందించారు. గత సీజన్‌ కంటే ఈసారి వరి, పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లాలో 7,24,405 ఎకరాల్లో అన్ని రకాల పంటలు, మెదక్‌ జిల్లాలో 3,73,509 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు.

News May 16, 2024

సంగారెడ్డి: ఓట్ల పండుగ.. ఆదాయం దండిగా

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు తమ స్వస్థలాలకు పయనం కావడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. మెదక్‌ రీజియన్‌ పరిధిలోని ఎనిమిది డిపోల నుంచి ఎన్నికల నిమిత్తం 323 బస్సు సర్వీసులు అదనంగా నడిపారు. మరో 17బస్సులను ఏపీకి తిప్పారు. సుమారు 10, 36, 200 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశారు. దీంతో మెదక్‌ రీజియన్‌కు రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరింది.

News May 16, 2024

మెదక్ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి వద్ద బట్టలు ఆరేస్తున్న దండెం తీగకు కరెంట్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఇద్దరు మృతిచెందగా ఒకరికి గాయాలయ్యాయి. మృతులు నీరుడి మణెమ్మ(45)ను కరెంట్ షాక్‌ నుంచి రక్షించడానికి వెళ్లిన మరిది కుమారుడు భాను ప్రసాద్(19) మరణించారు. వారిని కాపాడటానికి వెళ్లిన కూతురు శ్రీలతకు గాయాలకు గాయాలు కాగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 16, 2024

సిద్దిపేట: బైక్‌ను ఈడ్చుకెళ్లిన కారు.. భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

image

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మహిపాల్ రెడ్డి(39) మృతిచెందగా, భార్య నవిత తీవ్రంగా గాయపడింది. బైక్‌పై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనాన్ని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లగా మంటలు చెలరేగి ద్విచక్రవాహనం కాలిపోయింది. దీంతో మహిపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News May 16, 2024

సిద్దిపేట: ‘నేల చల్లబడ్డాక సాగు చేయాలి’

image

రెండు మూడు వర్షాలు పడి నేల చల్లబడ్డాక సాగుకు ఉపక్రమించాలని తొలకరి చినుకులకే విత్తనాలు నాటి నష్టపోవద్దని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉపసంచాలకులు(ఏడీఆర్‌) డా. మల్లారెడ్డి రైతులకు సూచించారు. వానకాలం సాగులో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమతుల్య సాగు అవసరమని తెలిపారు. నీటి సాంకేతికతకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు తీసుకోవాలని చెప్పారు.

News May 16, 2024

జహీరాబాద్‌లో పెరిగిన పోలింగ్.. గెలువు ఎవరిదో..?

image

జహీరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 4.93 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 69.01 శాతం నమోదు కాగా 2024లో 74.63 శాతం నమోదైంది. మొత్తం 16.41 లక్షలకు 12.25లక్షల మంది ఓటేశారు. ఇక్కడ 2019లో బీబీపాటిల్(BRS) 6,229 మెజార్టీతో మదన్ మోహన్ రావు(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో సురేశ్ షెట్కార్(INC), గాలి అనిల్ కుమార్(BRS), బీబీ పాటిల్,(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 16, 2024

సిద్దిపేట: 22 మందికి రూ. 25,500 జరిమానా

image

సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు, ఎస్ఐలు సిబ్బందితో కలిసి గత నెల రోజుల క్రితం సిద్దిపేట పట్టణం, పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 22 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేయగా మద్యం సేవించినట్లు రిపోర్టు వచ్చింది. వారిని బుధవారం సిద్దిపేట న్యాయమూర్తి శ్రావణి ముందు హాజరుపరచగా విచారణ చేసి 22 మందికి రూ.25,500 జరిమానా విధించారు.