India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాకు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తూప్రాన్ వద్ద గత ఏడాది నవంబర్ 26న నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈనెల 30న అల్లాదుర్గంలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ మరోసారి హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు.
సిద్దిపేటలోని ఇందిరానగర్‌కు చెందిన హిజ్రా ప్రశాంతికి పొరుగు సేవ కింద జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం, న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి నియామకపత్రం అందజేశారు. హిజ్రాలకు సమాన హక్కు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలిసారి ఉద్యోగ అవకాశం కల్పించామని, వారు ఆత్మన్యూనతా భావానికి లోనవకుండా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బీఫారాన్ని ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చేతుల మీదుగా నీలం మధు అందుకున్నారు. ఎంపిగా గెలిచి రావాలని ఈ సందర్బంగా వారు ఆయనకు సూచించారు. వారితో ఈ కార్యక్రమంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ప్రధాన సలహాదారులు హరగోపాల్ ఉన్నారు.
ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలం బోడ్మట్ పల్లి గ్రామంలో జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌తో కలిసి గాలి అనిల్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరారు.
పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం ఏడుపాయల వనదుర్గ క్షేత్రంలో వైభవంగా పల్లకీసేవ నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో రాజగోపురం నుండి శివాలయం మీదుగా భక్తి శ్రద్దలతో ఊరేగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈసందర్బంగా.. పాలక మండలి చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ధర్మకర్తలు వెంకటేశం, చక్రపాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మెదక్ లోక్‌సభ స్థానానికి ఇప్పటి వరకు 24 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున స్థానిక ఎమ్మెల్యే రోహిత్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్ రాంరెడ్డి పేరు ఖరారు చేసినా ఇంకా నామినేషన్ వేయలేదు. ఈనెల 24న వేస్తారని సమాచారం. ఇతర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు.
ప్రతిష్టాత్మకమైన మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేద్దామని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఇందుకు పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు అందరూ శ్రమించాలని కోరారు. నర్సాపూర్ నియోజకవర్గం కుల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ గుడి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, జాతర ఉత్సవాలకు ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు.
1980 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. ఇక్కడ మొత్తం 4,45,289 ఓట్లు పోల్ కాగా 3,15,077 (67.9) శాతం ఇందిరాకే రావడం విశేషం. ఆమెకు జిల్లాలో విడదీయలేని బంధ ఉంది. ప్రధాని హోదాలో పలుమార్లు జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో జడ్పీ సమావేశంలో, 1984 జులై 19న మెదక్‌లో జరిగిన సర్పంచుల సదస్సులో పాల్గొన్నారు. 1984 అక్టోబరు 31న హత్యకు గురైనప్పుడు మెదక్ ఎంపీగానే ఉన్నారు.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఫలితంపై అన్ని ప్రధాన పార్టీలలో ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులకు ఓటర్ నాడీ అంతు చిక్కక ఆందోళన చెందుతున్నారు. మరోపక్క రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఏ పార్టీ నాయకులు ఏ పార్టీలోకి పోతారో తెలియని పరిస్థితి నెలకొనడంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మెదక్ పార్లమెంటు స్థానం సవాల్‌గా మారింది.
మదన్ రెడ్డి BRSకు నమ్మకద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేశారని.. ఆయన పార్టీ మారినంత మాత్రమే BRSకు వచ్చిన నష్టమేమని లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నర్సాపూర్‌లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. మదన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా తన మిత్రుడు అని కేసీఆర్ రెండుసార్లు టికెట్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు ఆయన్ను గెలిపించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎందుకు చేరానని మదన్ రెడ్డి బాధపడుతున్నారని అన్నారు.
Sorry, no posts matched your criteria.