Medak

News April 24, 2024

మెదక్: అత్తను దారుణంగా కొట్టి చంపిన అల్లుడు

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్‌పల్లి కలాన్ గ్రామానికి చెందిన సూది కౌసవ్వ(50) హత్యకు గురైంది. ఆమె కూతురు శోభకు మెదక్ పట్టణానికి చెందిన మురాటి దశరథ(35)తో పెళ్లైంది. దంపతుల మధ్య గొడవలతో శోభ HYDలో అన్నావదిన వద్ద ఉంటోంది. కాగా భార్య కాపురానికి రాకపోవడానికి అత్త కౌసవ్వ కారణమని భావించిన దశరథ.. సోమవారం రాత్రి శెట్ పల్లికలాన్ వచ్చి అత్తను కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 24, 2024

 కోహిర్‌‌లో హత్య కేసు UPDATE..

image

సంగారెడ్డి జిల్లా <<13106901>>కోహిర్‌‌లో హత్య<<>>కు కారకులైన నిందితులను పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాలు.. HYD జగద్గిరిగుట్టకు చెందిన అన్వర్ ఆలీని గురుజవాడకు చెందిన మహమ్మద్ కైఫ్, రాజనెల్లికి చెందిన ముస్తకిం కలిసి కత్తితో దాడి చేసి చంపేశారు. ముగ్గురు కలిసి తరచూ దొంగతనాలు చేసేవారు. అయితే సోమవారం రాత్రి మద్యం తాగి గొడవ దిగారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి అన్వర్‌ను హత్య చేశారని జహీరాబాద్ పట్టణ సీఐ రవి తెలిపారు.

News April 24, 2024

మెదక్ జిల్లాకు అథిరధులు వస్తున్నారు..

image

మెతుకు సీమకు వివిధ పార్టీల అతిరథులు వస్తున్నారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరుస పర్యటనలతో రాజకీయ వేడి పెంచబోతున్నారు. ఈనెల 25వరకు స్వీకరించనుండగా BJP అభ్యర్థి రఘునందన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్లు వేశారు. ఈనెల 24న BRS‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేయనున్నారు. 25న అమిత్ షా సిద్దిపేటకు రానుండగా, మే 7, 8, 10తేదీల్లో కేసీఆర్ రానున్నారు. ప్రియాంక గాంధీని వచ్చే అవకాశాలున్నాయి.

News April 24, 2024

సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య

image

సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. కోహిర్ మండలంలోని ప్రభుత్వ కాలేజీ మైదానంలో ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. మృతదేహం వద్ద కత్తులను వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన వాసి అన్వర్ అలీ(28)గా గుర్తించారు. పాత తగాదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

సురేశ్‌ షెట్కార్‌ ఆస్తులు.. 3.5కిలోల బంగారం, 60 ఎకరాల భూమి 

image

జహీరాబాద్ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ తన కుటుంబ ఆస్తులు రూ.10.77కోట్లగా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. చరాస్తుల విలువ రూ. 3.20 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.7.57 కోట్లు. ప్రైమ్‌ ఫుడ్‌ టెక్‌ ప్రై.లిమిటెడ్‌లో రూ.20 లక్షల విలువైన షేర్లు, ఆయన సతీమణి పేరిట 3.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఖేడ్‌, సంగారెడ్డిలో కలిపి 60.08 ఎకరాల వ్యవసాయ, ఖేడ్‌లో అర ఎకరా వ్యవసాయేతర భూమి, 2 ఇళ్లు ఉన్నాయి.

News April 24, 2024

జహీరాబాద్: బీబీ పాటిల్ ఆస్తులు ఇవే..!

image

జహీరాబాద్ BJP అభ్యర్థి బీబీ పాటిల్‌ తన కుటుంబ ఆస్తులు రూ.151.69 కోట్లగా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో చూపించారు. వివిధ సంస్థల్లో రూ.1.88 కోట్ల విలువైన షేర్లు, పాటిల్‌ దంపతులిద్దరూ రూ.4.51 కోట్ల అప్పులు, అడ్వాన్సులు ఇచ్చారు. 18 వాహనాలు, 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 129.4 తులాల బంగారం, 1.93కిలోల వెండి ఉంది. 61.10 ఎకరాల వ్యవసాయ, 65.8 ఎకరాల వ్యవసాయేతర భూమి, 2 వాణిజ్య భవనాలు, 3.52కోట్ల అప్పులు ఉన్నాయి.

News April 24, 2024

పురపాలికల్లో పట్టు కోసం పార్టీల కసరత్తు..

image

సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్, జిన్నారం, మెదక్, జహీరాబాద్ లోక్ సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటే సులువుగా విజయం సాధించవచ్చని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురపాలికల అధ్యక్షులు, కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. పురపాలికల అసంతృప్త కౌన్సిలర్లతో చర్చలు జరుపుతున్నారు.

News April 24, 2024

సంగారెడ్డి: పిడుగుపాటుతో మహిళ మృతి

image

పిడుగుపాటులో మహిళ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్వ రేణుక(32) ఊరి శివారులో మేకలు మేపుతుంది. సాయంత్రం ఉరుములు,మెరుపులతో వర్షం పడటంతో రేణుక మరో ఇద్దరు ఓ చెట్టుకుందికి వెళ్లారు. ఈ క్రమంలో పిడుగుపాటు పడి రేణుక అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాల్యయి. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News April 24, 2024

మెతుకు సీమలో నెగ్గేదెవరో..?

image

ఓవైపు నామినేషన్ల, మరోవైపు ప్రచార పర్వం ఊపందుకోవడంతో మెదక్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రముఖుల రాకతో క్యాడర్‌లో జోష్‌ నింపింది. ప్రత్యేక రాష్ట్రంలో 2014, 19 ఎన్నికల్లో గెలిచిన BRS హ్యాట్రిక్ పై కన్నేసింది. పవర్‌లో ఉన్న కాంగ్రెస్ గెలుపు వ్యూహాలతో ముందుకెళ్తూ సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టాగా అటూ మోదీ నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు తమకే మద్దతిస్తారని ధీమాలో BJP ఉంది. గెలుపు ఎవరిదో చూడాలి.

News April 24, 2024

సంగారెడ్డి : ‘జర్నలిస్టులు బ్యాలెట్ ఓటుకు దరఖాస్తు చేసుకోవాలి’

image

పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే జర్నలిస్టులు బ్యాలెట్ ఓటుకోసం ఈనెల 23వ తేదీ లోపు DPRO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. అక్రిడేషన్‌కార్డు, ఫారం 12డీ, ఓటర్‌కార్డు జిరాక్స్ ప్రతులను DPRO కార్యాలయంలో అందజేయాలని సూచించారు.