India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రానికి ఇంకా తానే సీఎంనని కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెదక్‌లో నీలం మధు నామినేషన్ సందర్భంగా మెదక్ వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అయ్యాక BRS దుకాణం బంద్ అవుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్‌లో నీలం మధును గెలిపించాలన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల తర్వాత అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపోటములపై పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రభావం చూపనుంది. జనవరిలో విడుదల చేసిన ఓటర్ జాబితా ప్రకారం పటాన్‌చెరు సెగ్మెంట్‌లో 4,10,170 ఓటర్లు ఉన్నారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ ఓటర్లే అధికం అభ్యర్థి గెలుపోటములు ఈ సెగ్మెంట్ కీలకం కానుంది. ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో వలస కార్మికులు అధికంగా నివసిస్తుంటారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక్కడ ఫోకస్ పెట్టారు.
మెదక్ పార్లమెంటు స్థానానికి మూడో రోజు 9 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గౌటి మల్లేష్, దుబాల శ్రీశైలం, సత్యనారాయణ గౌడ్, చిక్కులపల్లి నవీన్, నాగమణి (రెండు సెట్లు), కొట్కూరు ప్రతాప్, గొంది భుజంగం, ఏ. లక్ష్మణ్, బండపల్లి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసినట్లు వివరించారు.
దుబ్బాకలో ఓడితే మెదక్‌లో పోటీ చేయకూడదా? అని రఘునందన్ రావు అన్నారు. మెదక్ రోడ్ షోలో సీఎం వ్యాఖ్యాలపై ఆయన ఫైర్ అయ్యారు. ‘కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో గెలవలేదా?. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతానన్న రేవంత్.. ఆ దోపిడీ సొమ్మును ఎంతమందికి పంచారో చెప్పాలి. మోదీ పదేళ్ల అభివృద్దిపై చర్చకు నేను సిద్దం, రేవంత్ రెడ్డి సిద్దమా?’ అంటూ రఘునందర్ రావు సవాల్ విసిరారు.
మెదక్‌కు గొప్ప చరిత్ర ఉందని CM రేవంత్ రెడ్డి అన్నారు. 1980లో కాంగ్రెస్ తరఫున ఇందిరా గాంధీ నిలబడితే గెలిపించుకొని PMను చేశారన్నారు. BHEL, ఇక్రిశాట్ వంటి సంస్థలను కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఏళ్లుగా మెదక్ జిల్లాను పట్టి పీడిస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
పేదల కష్టాలు తెలిసిన, బడుగు బలహీన వర్గాలకు చెందిన నీలం మధునే మెదక్ ఎంపీగా గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మల్లన్నసాగర్ భూముల కోసం మహిళలను పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడని అన్నారు. 10ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ.. మెదక్‌కు చేసిందేమీ లేదని, ఇప్పుడు గెలిపించినా ఏం చేయబోరన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా మూడోసారి విజయం సాధించేందుకు బీబీ పాటిల్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈసారి విజయం సాధించి హ్యాట్రిక్ విజయం ఖాతాలో వేసుకోవడానికి కృషి చేస్తున్నారు. 2014లో 5,08,661 ఓట్లతో మొదటిసారి విజయం సాధించగా.. 2019లో 4,34,244 ఓట్లతో రెండోసారి విజయం సాధించారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ తరఫున విజయం సాధించగా.. ఈసారి బీజేపీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు. కాగా ఈరోజు ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్నారు. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.
జహీరాబాద్ లోక్‌సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చర్చ నడుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, జుక్కల్, ఆందోల్, నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడంలో దృష్టి పెడితే గెలుపు ఖాతాలో వేసుకోవచ్చని సీఎం కాంగ్రెస్ నాయకుల సమావేశంలో అన్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా ఈనెల 24న జహీరాబాద్ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.
మనోహరాబాద్ మండలం కూచారం శివారులో తప్పుడు ధ్రువపత్రాలతో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన కూకట్‌పల్లికి చెందిన వీరపనేని మధుసూదన్ రావు(50), హైదరాబాద్ కు చెందిన వెంకటేశ్వర్లు(48)ను అరెస్టు చేసినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 13న సత్యనారాయణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఈనెల 7న ఇదే కేసులో కందవల్లి రాజేష్(34)ను అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు.
Sorry, no posts matched your criteria.