Medak

News March 17, 2024

సిద్దిపేట: నోడల్ అధికారులకు శిక్షణ: కలెక్టర్

image

లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల నోడల్ అధికారులుగా నియామకమైన వారికి శిక్షణ ఇస్తున్నట్టు కలెక్టర్ ఎన్నికల అధికారి మను చౌదరి తెలిపారు. విలేకరులతో మాట్లాడారు. మెదక్ లోక్ సభ పరిధిలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని, కరీంనగర్ లోక్సభ పరిధిలో హుస్నాబాద్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో జనగామ శాసనసభ పరిధికి సంబంధించి జిల్లాలోని నాలుగు మండలాలు ఉన్నాయన్నారు.

News March 17, 2024

మెదక్ ఎంపీ స్థానంపై వీడని పీటముడి

image

మెదక్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం ఎంపిక విషయంలో పీటముడి వీడటం లేదు. టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశిస్తున్నారు. మల్కాజ్‌గిరి టికెట్‌పై సైతం ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఇవ్వకుంటే మెదక్‌ టికెట్‌ అయినా ఖరారు చేయాలని ఆయన అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. పటాన్‌చెరుకు చెందిన నీలం మధు ‌, సంగారెడ్డి DCC అధ్యక్షురాలు, జగ్గారెడ్డి సతీమణి నిర్మల పేర్లు వినిపిస్తున్నాయి.

News March 17, 2024

ఒత్తిడి వద్దు.. ప్రశాంతంగా పరీక్షలు రాయండి: డీఈవో

image

పదవ తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానుండగా ఒత్తిడికి గురికావద్దని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని టెన్త్ విద్యార్థులకు డీఈవో వెంకటేశ్వరులు సూచించారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో మొబైల్ ఫోన్లు ,స్మార్ట్ వాచ్ ,ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లొద్దని అన్నారు.

News March 17, 2024

పాపన్నపేట: తండ్రిని చంపిన తనయుడు

image

పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో సంగం ప్రేమానందం(45)ను కొడుకు సందీప్ కొట్టి ఉరివేసి హత్య చేసినట్లు SI నరేశ్ తెలిపారు. తాగుడుకు బానిసైన ప్రేమానందం తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. పెద్దలు పంచాయతీ నిర్వహించిన మార్పు రాకపోగా బుధవారం మళ్లీ గొడవ పడటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన కొడుకు సందీప్.. తండ్రిని కొట్టి ఉరేసి చంపేశాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News March 17, 2024

సంగారెడ్డి: ఎన్నికల కోడ్.. విగ్రహాలకు ముసుగు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి ఎన్నికల నియామవళి అమలు వచ్చింది. వెంటనే అప్రమత్తమయిన జిల్లా యంత్రాంగం సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమాల గోడ పత్రికలు, ఫ్లెక్సీలను తొలగింపజేశారు. సంగారెడ్డి పట్టణ పరిధి పోతిరెడ్డిపల్లి కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఇలా ముసుగు వేశారు. బహిరంగ ప్రదేశాల్లో వివిధ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, హార్డింగ్, కటౌట్లు కూడా తొలగిస్తున్నారు.

News March 17, 2024

సిద్దిపేట: ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరగదన్నారు. జిల్లా ప్రజలు గమనించగలరని ఆయన సూచించారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోనూ రేపు ప్రజావాణి నిర్వహించారు.
SHARE IT

News March 16, 2024

పటాన్‌చెరు: శ్మశానవాటిక సమీపంలో మృతదేహం

image

పటాన్‌చెరు మం. రుద్రారం శ్మశానవాటిక సమీపంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. రుద్రారం కారోబార్ రాజు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి 45-50 వయసు ఉంటుందని గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News March 16, 2024

సంగారెడ్డి: మార్చి 18 నుంచి 144 సెక్షన్

image

ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామని SP రూపేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సెంటర్‌లకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

News March 16, 2024

మెదక్‌లో విషాదం.. బాలుడి సూసైడ్

image

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం దారిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కొమ్మ మింటూ అనే (16) బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది. శనివారం ఊరి శివారులోని చెరువులో దూకేశాడు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 16, 2024

మెదక్ పార్లమెంట్ పరిధిలో 18,12,858 మంది ఓటర్లు

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల 12 వేల 858 మంది ఉన్నారు. ఇందులో 8,95,777 పురుషులు, 9,16,876 మహిళలు, 205 ఇతరులున్నారు. సెగ్మెంట్‌లో సిద్దిపేటలో 2,36,474, మెదక్‌లో 2,16,748, నర్సాపూర్‌లో 2,26,154, సంగారెడ్డిలో 2,47,338, పటాన్‌చెరులో 4,07,419, దుబ్బాకలో 19,9,236, గజ్వే‌ల్‌లో 2,79,489 మంది ఓటర్లున్నారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 764 పోలింగ్ కేంద్రాలున్నాయి.

error: Content is protected !!