India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సాధారణ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ వాన్ష్ పేర్కొన్నారు. నర్సాపూర్ మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు 24 గంటలు పని చేయాలని, వాటిని పరిశీలించాలని, సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, తహసిల్దార్ కమలాద్రి పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఈరోజు నమోదైన ఉష్ణోగ్రత వివరాలు.. చిట్యాల 44.8, దూల్మిట్ట 44.2, సిద్దిపేట 43.7, కట్కూరు 43.3, కొత్తపేట, దౌల్తాబాద్ 42.6, కొమురవెల్లి, పఠాన్ చెరు 42.4, కల్హేర్, ప్రగతి ధర్మారం 42.3, రాంపూర్ 42.2, రేబర్తి 42.1, సముద్రాల, రామచంద్రపురం, జిన్నారంలో 42.0 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన ఇప్ప <<13078791>>వంశీ క్షేమం<<>>గా ఉన్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బంధువులు, కుటుంబీకులు మోసం చేశారని పేర్కొంటూ.. చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో పోలీసులు విచారణ చేపట్టి అల్లాదుర్గం సమీపంలోని అటవీ ప్రాంతంలో వంశీని గుర్తించారు. దీంతో పోలీసులుకు గ్రామస్థులు, కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత ఎక్కవగా ఉండగా.. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. దీంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎండలు కాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పడాలని వైద్యులు చెబుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల మొదటి ఘట్టం నేటితో ప్రారంభం అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ముహూర్త బలాన్ని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. మెదక్‌లో నేడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేస్తుండగా ఆయన అయోధ్య వెళ్లి రాముని చెంత నామినేషన్ పత్రాలు పెట్టి టైం ఫిక్స్ చేసుకున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముహూర్త బలం ఫిక్స్ చేసుకొని నామినేషన్ వేస్తున్నారు.
కాళ్లకల్‌లో ప్రతి ఆదివారం ఎల్లారెడ్డి కుంట వద్ద సంత జరుగుతుంది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో జనం రద్దీగా ఉంటుంది. దొంగలు అదును చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎల్లారెడ్డి కుంట సంతలో ప్రతీ వారం 10 వరకు సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు చోరీకి గురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఇతర సంతలోని ఇదే పరిస్థితి. వీటిపై పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న NCC కాడెట్ రాజేష్ గత 3 సంవత్సరాల నుండి వరుసగా పర్వతారోహణ చేశారు. NCC శిబిరాల్లో భాగంగా బేసిక్ (బీఎంసి), అడ్వాన్స్డ్ మౌంటెనిరింగ్ (ఏయంసీ), సెర్చ్ అండ్ రెస్క్యూ (యస్ & ఆర్) క్యాంపులను పూర్తి చేసి, అరుదైన అవకాశాన్ని రాజేష్ రాష్ట్రం తరపున వినియోగించుకున్నట్లు కళాశాల NCC ఆఫీసర్ లెఫ్టినెంట్ భవానీ తెలిపారు.
కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మెదక్‌లో ఎన్ని కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్ గెలవలేదని జోస్యం చెప్పారు. కాగా మంత్రి కోమటిరెడ్డి నల్లగొండలో మాట్లాడుతూ..ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని.. మేము గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో ఒక్కరు కూడా మిగలరని అన్నారు.
ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సిద్దిపేట కలెక్టర్ మనూచౌదరి, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కలెక్టరేట్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లనున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కావున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మెదక్‌కు తరలి రావాలని రఘునందన్ రావు కోరారు.
Sorry, no posts matched your criteria.