India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. గురువారం మండల కేంద్రంలోని ఓ ఇంటి స్లాబ్ మీద వాలింది. పెద్ద పెద్ద కండ్లు, పొడవాటి ముక్కు, తెలుపు రంగులో ఉంది. జనావాసాల మధ్యకొచ్చిన ఈ వింత పక్షిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు ఆశ్చర్య పడుతూ సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశారు.
BRSకు షాక్ తగిలింది. మెదక్ కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ఎలక్షన్ రెడ్డి BRSను వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో నీలం మధు, నర్సారెడ్డితో ఆయన భేటీ చర్చనీయాంశమైంది.
కొండపాక ఎంపీపీ అధ్యక్షురాలు రాగల సుగుణ దుర్గయ్యపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బలపరీక్షలో తొమ్మిది మంది ఎంపీటీసీలు ఎంపీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. రెండ్రోజుల్లో వైస్ ఎంపీపీ పీఠానికి బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది.
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. నిజాంపూర్ వైపు నుంచి సదాశివపేటకు బైక్ పై వెళ్తున్న యువకుడిని జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు సదాశివపేట మండలం వెల్లూర్ గ్రామస్థుడిగా గుర్తించారు.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలానికి చెందిన 25 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ ఛైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, తదితరులు బీఆర్ఎస్‌ను వీడారు. అనంతరం జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో సుమారు 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురువైంది. ఇరు పార్టీలనేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ BRS నేతలు సెటైర్లు వేశారు.
2006లో పటాన్‌చెరు మండలం చిట్కుల్ జీపీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014లో ఉపసర్పంచ్‌గా, 2014లో ZPTC ఎన్నికలలో TRS పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2019 సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానం చిట్కుల్ గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2023 పటాన్‌చెరు అసెంబ్లీకి BSP పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ సాధించాడు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాపనయ్య మూసుకు తండా శివారులో లేగ దూడను గుర్తుతెలియని అడవి జంతువు చంపేసింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గుగులోత్ బిమ్లాకు చెందిన లేక దూడ మరణించింది. అయితే ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని, చిరుత దాడిలోనే దూడ మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు. చిరుత పులి దాడి పై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
మెదక్ పార్లమెంటు స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందుగా ప్రకటించగా.. మొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రకటించింది. చిట్ట చివరకు రాత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ పేరును ప్రకటించింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో ప్రచారం జోరందుకోనుంది.
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. కొద్ది రోజులుగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో తాత్సారం జరిగిన విషయం తెలిసిందే. జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మలతో పాటు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని ఆలోచన చేసిన విషయం తెలిసిందే. చివరకు నీలం మధు పేరును ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.