Medak

News April 18, 2024

మెదక్‌: ముహూర్త బలంతో అభ్యర్థులు ముందుకు..!

image

పార్లమెంట్ ఎన్నికల మొదటి ఘట్టం నేటితో ప్రారంభం అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ముహూర్త బలాన్ని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. మెదక్‌లో నేడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేస్తుండగా ఆయన అయోధ్య వెళ్లి రాముని చెంత నామినేషన్ పత్రాలు పెట్టి టైం ఫిక్స్ చేసుకున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముహూర్త బలం ఫిక్స్ చేసుకొని నామినేషన్ వేస్తున్నారు.

News April 18, 2024

మెదక్: బయటకు వెళ్తున్నారా..? జాగ్రత్త

image

కాళ్లకల్‌లో ప్రతి ఆదివారం ఎల్లారెడ్డి కుంట వద్ద సంత జరుగుతుంది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో జనం రద్దీగా ఉంటుంది. దొంగలు అదును చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎల్లారెడ్డి కుంట సంతలో ప్రతీ వారం 10 వరకు సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు చోరీకి గురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఇతర సంతలోని ఇదే పరిస్థితి. వీటిపై పోలీసులు నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

News April 18, 2024

గజ్వేల్: పర్వతారోహణ చేసిన గజ్వేల్ విద్యార్థి

image

గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న NCC కాడెట్ రాజేష్ గత 3 సంవత్సరాల నుండి వరుసగా పర్వతారోహణ చేశారు. NCC శిబిరాల్లో భాగంగా బేసిక్ (బీఎంసి), అడ్వాన్స్డ్ మౌంటెనిరింగ్ (ఏయంసీ), సెర్చ్ అండ్ రెస్క్యూ (యస్ & ఆర్) క్యాంపులను పూర్తి చేసి, అరుదైన అవకాశాన్ని రాజేష్ రాష్ట్రం తరపున వినియోగించుకున్నట్లు కళాశాల NCC ఆఫీసర్ లెఫ్టినెంట్ భవానీ తెలిపారు.

News April 18, 2024

మెదక్‌లో BRSకు ఓటమి తప్పదు: మంత్రి వెంకట్ రెడ్డి

image

కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మెదక్‌లో ఎన్ని కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్‌ గెలవలేదని జోస్యం చెప్పారు. కాగా మంత్రి కోమటిరెడ్డి నల్లగొండలో మాట్లాడుతూ..ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమని.. మేము గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌లో ఒక్కరు కూడా మిగలరని అన్నారు.

News April 18, 2024

సిద్దిపేట: ‘నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సిద్దిపేట కలెక్టర్ మనూచౌదరి, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు.

News April 17, 2024

రేపు రఘునందన్ నామినేషన్.. పాల్గొననున్న గోవా సీఎం

image

మెదక్ జిల్లా కలెక్టరేట్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రేపు నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లనున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కావున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు మెదక్‌కు తరలి రావాలని రఘునందన్ రావు కోరారు.

News April 17, 2024

25 కోట్ల లిఖిత రామ నామాలతో శ్రీరామునికి అభిషేకం

image

గద్వాల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో 25 కోట్ల లిఖిత శ్రీరామ నామాలతో సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామారాజు అద్దాల మందిరం వద్ద రామనామస్మరణతో ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా రామనామ స్మరణ చేస్తే ఆనందం లభిస్తుందని రామకోటి రామరాజు పేర్కొన్నారు.

News April 17, 2024

సిద్దిపేట: సివిల్స్ ర్యాంకర్ అఖిల్ నేఫథ్యం ఇదే..

image

వ్యవసాయ కుటుంబం నుంచి IASగా నిలిచి తల్లిదండ్రుల కష్టాన్ని సగర్వంగా నిలిచేలా చేశాడు. వైఫల్యాలు వెక్కిరించినా ఐదో ప్రయత్నంలో IAS సాధించాడు కొండపాకకు చెందిన అఖిల్. తండ్రి నరేష్ వ్యవసాయం చేస్తూ పెద్ద కొడుకు అఖిల్‌ను ఉన్నత చదువులు చదివించాడు. 2018లో ఇంజనీరింగ్ అయిపోగానే ఇంటి నుంచే సివిల్స్‌కు ప్రిపేర్ అయి 2019,20, 22లో నిరాశ ఎదురైనా 2021లో IPS సాధించాడు. 2023లో IAS సాధించి లక్ష్యాన్ని ముద్దాడాడు.

News April 17, 2024

MDK: మహిళ హత్య కేసు‌లో నిందితుడికి జీవిత ఖైదు

image

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన రాములు 2019లో చేవెళ్ల బస్టాండులో ఉన్న గండీడ్ మండలం నంచర్లకు చెందిన అంజులమ్మను బైక్ పై ఎక్కించుకున్నాడు. పటాన్చెరు మండలం లక్డారం శివారులో ఆమెను హత్య చేసి నగలు ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై తాజాగా సంగారెడ్డి కోర్టు నిందితుడికి శిక్ష విధించింది. నిందితుడు 2003-19లో 10 హత్యలు, చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.

News April 17, 2024

మెదక్: సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం

image

సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మెదక్ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 25 వరకు స్వీకరిస్తామన్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు.