Medak

News April 15, 2024

HYDలో మెదక్ వాసి సూసైడ్

image

HYD కూకట్‌పల్లి PS పరిధి ప్రకాశ్‌నగర్‌లో మెదక్‌ వాసి సూసైడ్ చేసుకొన్నాడు. సోమవారం రమేశ్(20) అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సీతారాంనగర్‌కి చెందిన రమేశ్ ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 15, 2024

MDK: గుండెపోటుతో ఆర్టీసీ కంట్రోలర్ మృతి

image

గుండెపోటుతో ఆర్టీసీ కంట్రోలర్ మరణించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మెదక్ డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న ఎండి. ఆరిఫ్ (55)కు ఆదివారం గుండెపోటు రాగా తార్నాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్టంట్ వేశాక చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య సుల్తానా, ముగ్గురు కుమారులున్నారు. ఆరిఫ్ స్వగ్రామం పాపన్నపేట మండలం కుర్తివాడ. ప్రస్తుతం మెదక్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు.

News April 15, 2024

MDK: మాజీ MLA కారులో డబ్బులు పట్టివేత

image

ఎన్నికల కోడ్‌ వేళ మాజీ MLA కారులో డబ్బులు పట్టుబడ్డాయి. హవేలీ ఘనపూర్ మండల శివారులో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ వాహనంలో రూ. 1,80,000 పట్టుబడినట్లు SI ఆనంద్ గౌడ్ తెలిపారు. ఎటువంటి ఆధారాలు చూపనందున సీజ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. కారులో ఉన్న నితిన్ రెడ్డి, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు.

News April 15, 2024

HYD: వివాహేతర సంబంధం.. DSP ఇంటి ముందు ఆందోళన

image

ఆదిభట్ల PS పరిధి తుర్కయంజాల్ శ్రీ సాయిపంచవతి హోమ్స్‌‌లోని DSP రంగా నాయక్ ఇంటి ముందు ఆయన భార్య ఆందోళనకు దిగారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని జ్యోతి ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నారు. కాగా, రంగా నాయక్ ప్రస్తుతం మెదక్ ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News April 15, 2024

కత్తిమీద సాములా మెదక్ ఎంపీ ఎన్నికలు

image

లోక్‌సభ ఎన్నికలు ప్రధాన పార్టీల నేతలకు అగ్ని పరీక్షలా మారాయి. ఆయా BRS, కాంగ్రెస్, BJP అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించడంతో ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో BRS-6 చోట్ల, కాంగ్రెస్‌ ఒక చోట గెలుపొందాయి. మెదక్ ఎంపీ స్థానాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు రంజుగా మారాయి. దీంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కత్తి మీద సాములా మారాయి.

News April 15, 2024

MDK: కూరుతు కళ్లేదుటే తండ్రి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో కూరుతు కళ్లేదుటే తండ్రి మృతిచెందాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌కు చెందిన రామ్ మురాట్ తన కుమార్తె(6)తో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై మేడ్చల్ నుంచి వస్తుండగా హైవేపై ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో లారీ తగిలింది. దీంతో కిందపడ్డ రామ్ పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 15, 2024

మెదక్ జిల్లాలో వార్షిక పరీక్షలు ప్రారంభం

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నేటి నుండి వార్షిక పరీక్షలు ప్రారంభమాయ్యాయి. పరీక్షలు బాగా రాసేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాధికారి ప్రొ. రాధాకిషన్ ఆధ్వర్యంలో ఎండలు మండుతున్నందున అన్ని ఏర్పాట్లు చేశారు.

News April 15, 2024

MDK: ఓటరు నమోదుకు నేడే చివరి తేదీ..

image

అర్హులైన యువతీ, యువకులు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేందుకు నేడే చివరి అవకాశం. ఈనెల 16న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కొనసాగుతున్న నూతన ఓటరు నమోదు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి ఉండి ఇంకా ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

News April 15, 2024

మెదక్: పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొండా సురేఖ

image

కాంగ్రెస్ లోకసభ అభ్యర్థులు, ఇంఛార్జీలతో నోవాటెల్ హోటల్ లో జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటిలో మెదక్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ హజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ చర్చలో మెదక్, జహీరాబాద్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నీలం మధు, సురేశ్ షేట్కార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హజరయ్యారు.

News April 15, 2024

సిద్దిపేట: 20 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో సిద్దిపేటలో ఈనెల 20 నుంచి సిద్దిపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ క్రీడా మైదానంలో నెల రోజులపాటు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్ తెలిపారు.