Medak

News April 9, 2024

సిద్దపేట: చిరుతను కొట్టి చంపి.. తగలబెట్టి..

image

చిరుతను కొట్టి చంపి తగలబెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. FRO సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దపేట జిల్లా దౌల్తాబాద్ అటవీ ప్రాంతంలో నెల రోజుల క్రితం సాయిలు, మరో ముగ్గురు కలిసి అడవి పందుల కోసం వల పెట్టగా.. అందులో చిరుత చిక్కింది. భయాందోళనకు గురైన వారు చిరుతను కర్రలతో కొట్టి చంపి ఆనవాళ్లు లేకుండా కళేబరాన్ని తగులబెట్టారు. పోలీసులు సాయిలును అదుపులోకి తీసుకొని విచరణ చేపట్టారు.

News April 9, 2024

సిద్దిపేట: ఉద్యోగాల పేరిట సైబర్ మోసం

image

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు టోపీ పెట్టి రూ. 20 లక్షలు కాజేసిన సంఘటనలు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్నాయి. సీపీ అనురాధ వివరాల ప్రకారం.. సిద్ధిపేట పట్టణానికి చెందిన ఒక యువతి, నంగునూరు మండల కేంద్రానికి చెందిన మరొక యువతి ఉద్యోగ అన్వేషణలో భాగంగా గూగుల్లో ఓ గుర్తు తెలియని లింకులో తమ వివరాలు నమోదు చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.

News April 9, 2024

మెదక్: ‘మా పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటుంది’

image

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడుపులో పెట్టి చూసుకుంటుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందునాయక్ ఆధ్వర్యంలో శిలాజి నగర్, టేకులతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News April 9, 2024

సంగారెడ్డి: గ్రూప్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్- 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి సోమవారం తెలిపారు. సంగారెడ్డి హాస్టల్ గడ్డలోని సమీకృత వసతి గృహంలో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులు నేరుగా దరఖాస్తుల సమర్పించాలన్నారు.

News April 8, 2024

పటాన్‌చెరు: రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ విద్యార్థి మృతి

image

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ విద్యార్థి ఆకుల అరుణ్ (23) మృతిచెందాడు. ఇస్నాపూర్ వెళ్లే దారిలో అరుణ్ ప్రయాణిస్తున్న బైకును ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈఘటనలో అరుణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు కామారెడ్డికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. పఠాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2024

మెదక్: తేనె మంచు పురుగుతో మామిడి రైతుల ఆందోళన

image

మామిడి రైతుకు గడ్డుకాలమొచ్చింది. పూత, కాత కాసినప్పటికీ అధిక ఉష్ణోగ్రత, తెగుళ్లతో అంతా రాలిపోతుంది. ఫలితంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెదక్ జిల్లావ్యాప్తంగా 2,600 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. వీటిలో సింహభాగం బంగినిపల్లి రకం సాగు చేశారు. కాగా మామిడికి పూత ఏటా డిసెంబర్‌ నెలాఖరున వస్తుండగా ఈ ఏడాది జనవరిలో వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

News April 8, 2024

MDK: మొర్రి పండ్ల కోసం వెళ్లి యువకుడి మృతి

image

మొర్రి పండ్ల కోసం వెళ్లిన యువకుడు విద్యుదాఘతంతో మృతి చెందిన ఘటన హవేలీ ఘనపురం మండలం శాలిపేట శివారులో సోమవారం జరిగింది. బూరుగుపల్లికి చెందిన బాజా కిషోర్(20) మొర్రి పండ్లు తెంపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ పెద్ద లైన్ చెట్టుకు తగిలి అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా మృతి చెందాడు. కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు.

News April 8, 2024

మినీ ఇండియా పటాన్‌చెరుపైనే అందరి దృష్టి..!

image

మినీ ఇండియాగా పేరుపడిన పటాన్‌చెరు నియోజకవర్గంపై అన్ని పార్టీల దృష్టి సారించాయి. 3 లక్షలపై చిలుకు ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో విభిన్న రకాల ప్రజలు ఉన్నారు. పటాన్ చెరులో ఆధిక్యత వస్తే గెలుపు సులువు అనే ధీమాలో పార్టీలు ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు ఈ ప్రాంతంలో ఫోకస్ పెట్టాయి. ఎక్కువ ఓట్లు కొల్లగొట్టి తమ గెలుపుకు బాటలు వేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

News April 8, 2024

ఉత్తమ రక్తదాతగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డికి ఉగాది పురస్కారం

image

ఉత్తమ రక్తదాతగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి ఉగాది పురస్కారం అందుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో రక్త, అవయవ దానాలపై విస్తృత ప్రచారం చేస్తూ, 52 మార్లు రక్తదానం చేసి లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ మెదక్ శాఖ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఇప్పటివరకు 4,127 యూనిట్లను సేకరించగా రెడ్డి గర్జన జాతీయ మాసపత్రిక, సామాజిక సంస్థ ఈ అవార్డు అందజేసింది.

News April 8, 2024

మెదక్: వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు

image

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఎన్నికల నిబంధన ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలుపుతూ సిద్దిపేట త్రీ టౌన్ కేసు నమోదు చేశారు. సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా ఐకెపి, ఈజీఎస్ ఉద్యోగులతో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఎంపీ అభ్యర్థితోపాటు మాజీ సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు.