India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్‌లోని దివినో విల్లాస్‌లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.
ఉమ్మడి MDK, ADB, KNR, NZB పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. అధికారులు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు, ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు సిద్ధం చేశారు. లెక్కింపునకు 2 నుంచి 3 రోజలు పట్టే అవకాశం ఉన్నందున షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించారు. ఆ ఇద్దరు విజేతలు ఎవరో చూడాలి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు.
సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఐఐటి విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషించారు.
మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతిని మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. శ్రీపాద రావు చిత్రపటానికి కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం యువజన, క్రీడల అధికారి వై.దామోదర్ రెడ్డితో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతో <<15621244>>బాలింత మృతి<<>> చెందిందని బాధిత కుటుంబీకులు ఆందోళన చేశారని సంగారెడ్డి ఎస్‌ఐ పి.రవీందర్ అన్నారు. ఎస్‌ఐ వివరాలు.. కోహీర్ మండలం మద్రికి చెందిన గర్భిణీ మహానందిని ప్రసవానికి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవంలో ఆడ శిశువు పుట్టగా, బాలింత మృతి చెందింది. భర్త నవీన్, కుటుంబీకులు కన్నీళ్ల పర్యంతమై ఆస్పత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రుల, ఉపాధ్యాయ MLC ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీనేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ శ్రేణులతో కలిసి పోలింగ్ కేంద్రాల వారీగా ప్లస్, మైనస్‌లపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం, తదితర అంచనాలతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఈ ఫలితాలు వచ్చే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో విద్యావంతుల తీర్పుపై రాజకీయపార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రేపు గెలువు ఎవరిదో తేలనుంది.
రంజాన్ నెల సందర్భంగా మెదక్ జిల్లాలోని ఉర్దూ మీడియం పాఠశాల వేళల్లో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఉర్దూ మాధ్యమంలో చదివే విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పాఠశాలలు పని చేస్తాయని పేర్కొన్నారు. ఈ మార్పులు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ఈ విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు గమనించాలని సూచించారు.
పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు. చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీప్ సూపర్డెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు కస్టోడియన్‌లతో సమావేశం నిర్వహించారు. డీఈఓ రాధాకృష్ణ, రాజిరెడ్డి, సుదర్శన్ మూర్తి తదితరులున్నారు.
ఇంటర్ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గురుకుల పాఠశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న కిషోర్ తన కూతురిని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదివిస్తున్నారు. శివరాత్రి పండుగకు వచ్చిన విద్యార్థి తిరిగి వెళ్లేందుకు ఇష్టం లేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.