India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిద్దిపేటలోని గాంధీ చౌరస్తాలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రకృతి ప్రేమిద్దాం.. మట్టి వినాయకులను పూజిద్దాం అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని అన్నారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశావర్కర్‌పై ఆసుపత్రి పర్యవేక్షకుడు అనిల్ డేవిడ్ దాడికి పాల్పడ్డాడు. ఆశాల సమావేశానికి వచ్చిన వారిపై విచక్షణ కోల్పోయి బూతులు తిడుతూ బయటికి గెంటేశాడు. దాడికి పాల్పడిన అనిల్ డేవిడ్‌ను విధుల నుంచి తొలగించాలని మండల వైద్యాధికారి సాయి సింధుకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆశాలు తెలిపారు.
వినాయక నవరాత్రి వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. జోగిపేటలో శాంతి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబి, వినాయక నిమజ్జనం ఒకేసారి రావడంతో ఇరువర్గాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో జోగిపేట సిఐ అనిల్ కుమార్, ఎస్సై పాండు, తహసిల్దార్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి కాసేపు టీచరుగా మారి కేజీబీవీ విద్యార్థులకు పాఠాలు బోధించారు. మంగళవారం దుబ్బాక మండల కేంద్రంలో కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ స్వాతి అధికవర్షాలతో కురుస్తున్న డార్మెటరీని, అసంపూర్తిగా ఉన్న కాంపౌండ్ వాల్‌ను కలెక్టర్‌కు చూపించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ₹4 లక్షల నుంచి ₹5 లక్షలకు ఎక్స్‌గ్రేషియా పెంచామన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఎకరానికి ₹10 వేల నష్టపరిహారం, మృత్యువాత పడ్డ పాడిగేదెకు ₹30 నుంచి ₹50 వేలు మేక, గొర్రెకు మూడు నుంచి ₹5వేల ఆర్థికసాయం ప్రభుత్వమందిస్తుందన్నారు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో దారుణం జరిగింది. గొల్లగూడెం గ్రామాలో చేతబడి నెపంతో రాములు అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడిలో రాములుకు తీవ్రగాయాలై మృతి చెందాడు. ఈ దాడిలో మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా, వారిని జోగిపేట ఆస్పత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
భారీ వర్షాల వల్ల జిల్లాలో ఇప్పటివరకు 165 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారి ద్వారా అంచనా వేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 223 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదుల రిజిస్టర్‌ను పరిశీలించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 29 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్‌లో అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కాసులాబాద్ కిష్టయ్య భార్య ఏడాది క్రితం మృతిచెందగా ఇద్దరు కొడుకులు, కూతురుతో నివసిస్తున్నాడు. నిన్న కూతురు కళ్యాణి (16) చెరువులో పడి చనిపోగా.. అన్న రాము(20) పురుగు మందు తాగి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయాడు. కళ్యాణి మృతదేహం మసిరెడ్డి కుంటలో ఈరోజు లభ్యమైంది.
భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఫణంగా పెట్టి.. విధినిర్వహణలో నిమగ్నమైన విద్యుత్ ఉద్యోగుల సేవలు అమూల్యమైనవని సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సోమవారం X వేదికగా హరీష్ రావు విద్యుత్ ఉద్యోగులు అందిస్తున్న సేవలు, పత్రికల్లో వచ్చిన వార్తలు పోస్ట్ చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వారు అందిస్తున్న సేవలను ఎంత పొగిడినా తక్కువే అని హరీష్ రావు కొనియాడారు.
Sorry, no posts matched your criteria.