India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయా సంబంధించిన వివిధ దశలలో ఉన్న పనులను వాటి పురోగతిని సమీక్షించి సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన నూతన రేషన్ కార్డుల జారీ పథకంలో భాగంగా ప్రజలు అయోమయంలో పడ్డారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి నాలుగు పథకాలను అమలు చేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు అందజేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీ సేవలో అప్లై చేసుకోవాలనడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు.
ఉమ్మడి MDK, KNR, NZB. ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో 71 మంది నిలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. మంత్రి, ఆందోల్ MLA దామోదర రాజనర్సింహ, పద్మినీరెడ్డి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో నిజామాబాద్లో మిత్రుడి పెళ్లికి వెళ్లి అక్కడ పద్మినీతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. స్నేహితుల సహాయంతో 1985లో ఇద్దరూ పెళ్లి చేసుకోగా ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వదించారు.
మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాజు (24) కొరియర్ బాయ్గా పని చేస్తున్నాడు. రాత్రి హైదరాబాద్ వైపు నుంచి తూప్రాన్ వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ రామాయపల్లి బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈనెల ఒకటో తేదీన శ్రీను ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడగా, కేసు నమోదు చేసిన పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు బాధితుడి అన్న కొడుకు మూడవ అంజ్యాను అరెస్టు చేసి అతని నుంచి రూ.2.60లక్షల నగదుతో పాటు వెండి పట్టగొలుసులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నూతనంగా నియమితులైన పోలీస్ సిబ్బందికి రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మహేందర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఈఐఆర్, ఐఆర్ఏడి సైబర్ అవేర్నెస్, ఈ ఛానల్ పై వారికి శిక్షణ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో చిరుత పులి సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన దాసరి పెద్ద ఎల్లయ్య వ్యవసాయ పొలం వద్ద పశువులపాకపై చిరుత పులి దాడి చేసి ఒక లేగ దూడను చంపేసింది. ఉదయం పశువుల పాకకు వెళ్లిన రైతు లేగ దూడపై చిరుత దాడిని గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.