India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత ఆరు నెలలుగా ఊరిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావాహులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారిగా ఓటర్ల జాబితా తయారికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో గ్రామాల్లో సమీకరణాలు మొదలయ్యాయి. ముఖ్యంగా యువత స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తోంది. శుక్రవారం ఇన్‌ఫ్లో 1907 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 391 క్యూసెక్కులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. తాలేల్మ లిఫ్ట్ ఇరిగేషన్‌కు 31 క్యూసెక్కులు, హెచ్ఎండబ్ల్యూఎస్కు 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కోసం 70 క్యూసెక్కులు, వృథాగా 210 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు తెలిపారు.
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లోనూ భయపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కుక్కల దాడులకు గురయ్యారని, పిల్లలను బయటకు పంపాలంటే భయంగా ఉందని చెబుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీ ప్రాంతంలో కుక్కల బెడద ఉందా కామెంట్ చేయండి.
తిహార్ జైల్లో MLC కవితతో MLA హరీశ్‌రావు భేటీ అయ్యారు. శుక్రవారం ములాఖత్‌లో భాగంగా జైల్లో కవితను కలిశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటామని ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ED అరెస్ట్ చేయగా, ఆ తర్వాత CBI అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఆమె జైలులో ఉన్నారు.
సంగారెడ్డి జిల్లా కంది IITHలోని ‘టీహాన్’ (టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఇన్ అటానమస్ నావిగేషన్) విభాగం టెక్నాలజీ ఈ-ఫ్లాపింగ్ వింగ్స్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా గాల్లోకి ఎగురవేసి పరీక్షించింది. ఇవి కొండలు, గుట్టలపై, అటవీ ప్రాంతాల్లో జీపీఎస్‌తో నిర్దేశిత లక్ష్యానికి చేరగలదు. వీటి మార్గంలో ఏవైనా అడ్డం వస్తే సెన్సార్లు పసిగడతాయి. ఆటోమేటిక్‌గా ఆ డ్రోన్ తిరిగి మళ్లీ ఆపరేటర్ దగ్గరకు వచ్చిచేరుతోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. మద్యానికి బానిసై తాండూరు పరిధికి చెందిన రాజు(40).. అనారోగ్య సమస్యలతో హుస్నాబాద్‌కు చెందిన రాజిరెడ్డి(65) ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే క్రమంలో భార్య కాపురానికి రావడం లేదని మిరిదొడ్డి మండలానికి చెందిన చంద్రం(30).. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన జగదీశ్‌రెడ్డి(24) మిత్రులకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లి మృతిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన టేక్మాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పాపన్నపేట ASI సంగన్న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకూతురు(14) 8వ తరగది చదుతోంది. కాగా, 9నెలల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుండేది. బుధవారం మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గురువారం తండ్రి ఫిర్యాదులో కేసు నమోదైంది.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ యాదగిరిగుట్టకు పోదామని హరీశ్ రావుకు సవాల్ విసిరితే వంకరగా మాట్లాడిన ఆయన నేడు యాదాద్రికి ఎందుకు వెళ్లాడని మెదక్ MP రఘునందన్ రావు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హరీశ్ రావు తీరును ఎండగట్టారు. అధికారం కోల్పోయి, పదవి ఊడిపోవడంతో ఇప్పుడు ఆయనకు దేవుళ్లు గుర్తొస్తున్నారా అని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మండల గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని అధికారులు తెలిపారు. కరెంట్ బిల్లు, ప్రజాపాలన దరఖాస్తు రసీదు, రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ రూపేష్ పోలీసు అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలకు గురైనప్పుడు డబ్బు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే సైబర్ నేరాలకు గురికాకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.