Medak

News January 18, 2025

మెదక్: టోల్ ఫ్రీ నంబర్ మార్పు: కలెక్టర్

image

ప్రభుత్వం ఈనెల 26వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించనున్న పథకాలకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ మార్పు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే 08455- 276155 నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

News January 17, 2025

మెదక్: DSC-2008 అభ్యర్థుల కల సాకారమయ్యేనా..?

image

16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ- 2008 అభ్యర్థుల కల సాకారం అవుతుందా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. DSC-2008 అభ్యర్థుల పోస్టింగులకు సంబంధించిన దస్త్రాలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సంతకం పెట్టి ఆమోదం తెలపడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కాగా, 2024 సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా అభ్యర్థులు 280 మంది వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు.

News January 17, 2025

సంగారెడ్డి: రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

image

సంక్రాంతి సెలవుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 18 నుంచి పునః ప్రారంభం అవుతున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు రెగ్యులర్‌గా రావాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు యథావిధిగా నిర్వహించాలని చెప్పారు.

News January 17, 2025

సంగారెడ్డి: అక్కాచెల్లెళ్ల మృతి.. కేసు నమోదు

image

అదృశ్యం అయిన బాలిక బావిలో శవమై దొరికింది. SI వివరాల ప్రకారం.. సంగారెడ్డి(D) రాయికోడ్ (M) సంగాపూర్‌కి చెందిన సతీశ్-అనితకు ఇద్దరు కుమార్తెలు. వీరు విడిపోగా.. పిల్లలు తండ్రి వద్దే ఉంటున్నారు. ఇటీవల చిన్నకూతురు హరిత(6) మృతిచెందింది. ఈక్రమంలో ఈ నెల 9న వైష్ణవి ఇంటి నుంచి వెళ్లిపోయి.. గురువారం గ్రామ శివారులోని బావిలో శవమై తేలింది. అక్కాచెల్లెళ్ల మృతిపై అనుమానం ఉన్నట్లు నాన్నమ్మ ఫిర్యాదు చేసింది.

News January 17, 2025

BREAKING.. మెదక్: కొడుకును నరికి చంపిన తండ్రి

image

వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో రాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్(30) మద్యం తాగి రోజు తండ్రిని వేధించేవాడు. నిన్న రాత్రి కూడా గొడవ పడటంతో పడుకున్న శ్రీకాంత్‌ను కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.

News January 16, 2025

మెదక్: సర్వేను పక్కగా నిర్వహించాలి: కలెక్టర్

image

రామాయంపేట మండలం కాట్రియల్ గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, కొత్త రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పంచాయతీ సెక్రటరీ ధనలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

News January 16, 2025

3 రోజుల్లో నుమాయిష్‌కు 2,21,050 మంది

image

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు 3 రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి రోజు ఎక్కువగా 76,500 మంది నుమాయిష్‌కు రాగా.. ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా మారాయి. పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

News January 16, 2025

గజ్వేల్: అనాథలైన ముగ్గురు పిల్లలు

image

సిద్దిపేట జిల్లా బంగ్లావెంకటాపూర్ గ్రామంలో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. దర్శనం నర్సింలు-నాగమణి దంపతులకు ముగ్గురు కొడుకులు. నర్సింలు మతిస్తిమితం కోల్పోయి తిరుగుతుండగా.. ఆయన భార్య ఈ నెల 5న కిడ్నీ వ్యాధితో చనిపోయింది. దీంతో వారి పిల్లలు రాజేందర్(7), హరికృష్ణ(5), చందు(3) అనాథలుగా మారారు. వీరికి వృద్దురాలైన అమ్మమ్మ మాత్రమే తోడుగా ఉంది. దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News January 15, 2025

మెదక్: పోరాట యోధుడి జయంతి నేడు

image

1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్‌ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.

News January 15, 2025

GET READY.. 18న నవోదయ ప్రవేశ పరీక్ష

image

నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు NVS ఈనెల 18న ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని వర్గల్ నవోదయ ప్రిన్సిపల్‌ తెలిపారు. వెబ్‌సైట్‌ www.Navodaya.gov.in నుంచి విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పుట్టిన తేదీ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.