India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వర్గల్‌కు చెందిన పసుల లింగం(50) బైక్‌పై తూప్రాన్ వెళ్లి వస్తుండగా నాచారం వద్ద గజ్వేల్ తూప్రాన్ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. లింగం కూతురు తేజశ్రీ బుధవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఇంటర్ తొలి రోజు పరీక్ష రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.

నార్సింగి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఫైరింగ్ రేంజ్ పనులను ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించి సలహాలు, సూచనలు చేశారు. ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం వేరే జిల్లా లోని ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. ఫైరింగ్ రేంజ్ లేని లోటును త్వరగా పూర్తి చేసి, ఫైరింగ్ రేంజ్‌ను సిబ్బందికి త్వరగా అందుబాటులోకి తేవడానికి కృషి చేయాలని అధికారులకు తెలిపారు. వెంట తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి ఉన్నారు.

డాక్టర్లు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాల్సిందేనని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆశా వర్కర్ల నుంచి మొదలు పెడితే, టీచింగ్ హాస్పిటల్స్‌లో ప్రిన్సిపల్స్ వరకూ ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేయాల్సిందేనన్నారు. ఈ మేరకు బుధవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. డ్యూటీలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల, టీజీఆర్ఎస్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా 6,410 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 6,180 మంది పరీక్షకు హాజరయ్యారు. 230 వివిధ కారణాల వల్ల పరీక్షకు హాజరుకాలేదన్నారు.

మాసాయిపేట మండలంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక పాఠశాలలో అమలు సత్ఫలితాలు దిశగా ముందుకు పోతుందని తెలిపారు.

మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల, టీజీఆర్ఎస్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, స్క్రైబ్ విధానం గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం అయ్యేలా నూతన మెడికల్ కాలేజీలు సిద్ధం కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్‌లోని నూతన మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలలో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని పేర్కొన్నారు.

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన నిందితుడు 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీని కల్లు షాప్ నుంచి నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసి, చున్నీ ఆమె గొంతుకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.

మెదక్ జిల్లా నాందేడ్-అకోలా 161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్మట్ పల్లి- చిల్వర్ మధ్యలో హైవే బ్రిడ్జిపై రాంగ్ రూట్‌లో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అల్లాదుర్గంకు చెందిన బండ సాయిలు (55), మణెమ్మగా పోలీసులు గుర్తించారు. బొడ్మట్ పల్లి సంతలో కూరగాయలు అమ్మి ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Sorry, no posts matched your criteria.