Medak

News July 19, 2024

రైతు రుణమాఫీ పేరిట లింకులు వస్తే ఓపెన్ చెయొద్దు

image

రైతు రుణమాఫీ అంటూ ఫోన్‌కు లింకులు వస్తే ఓపెన్ చెయొద్దని SP ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఏదైన కార్యక్రమం ప్రారంభించగానే సైబర్ నేరగాళ్లు అదే పేరిట ఆన్‌లైన్ మోసాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైన సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌ చేయడం, దగ్గర్లోని PSలో ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బును రికవరీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News July 19, 2024

మెదక్: ‘సైబర్ నేరాలు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి’

image

సైబర్ నేరాల మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతుల రుణమాఫీ పేరుతో వచ్చే ఫేక్ లింకులను, అపరిచిత కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు.

News July 18, 2024

సంగారెడ్డి: EMT ఉద్యోగులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డి జిల్లాలో EMRI సంస్థ 108లో EMT ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు Bscనర్సింగ్, లైఫ్ సైన్స్, Bఫార్మా, GNM, DMLT కోర్సులు పూర్తిచేసి 35ఏళ్లలోపు అభ్యర్థులు ఈ నెల 23న సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే ఇంటర్వ్యూలకు సకాలంలో హాజరు కావాలన్నారు.

News July 18, 2024

మెదక్ కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

image

మెదక్ జిల్లాకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా శాంతిభద్రతలకు పరిరక్షించడంలో కింది స్థాయి అధికారులను సమన్వయం చేస్తూ ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా పగడ్బందీగా చర్యలు చేపడతామని చెప్పారు.

News July 18, 2024

సిద్దిపేట: డీఎస్సీ పరీక్ష కేంద్రాలను సందర్శించిన సీపీ

image

డీఎస్సీ పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సందర్శించారు. సిద్దిపేట పట్టణంలో ఉన్న డీఎస్సీ పరీక్ష కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన సీపీ బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపి మధు ఉన్నారు.

News July 18, 2024

సంగారెడ్డి: నేడు లక్షలోపు రుణమాఫీ జగ్గారెడ్డి

image

రాష్ట్రంలో రైతులకు రూ.లక్షలోపు పంట రుణం తీసుకున్న వారికి ప్రభుత్వం గురువారం రుణమాఫీ చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో 7,528 మంది రైతులకు రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రైతులు సా.4 గంటలకు నియోజకవర్గంలో సంబరాలు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేర్కొన్నారు.

News July 18, 2024

సంగారెడ్డి: ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

image

ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌‌ పరిధిలో జరిగింది. CI నాగరాజు వివరాలు.. బీరంగూడలోని రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుమంత్‌ (30) రుణం తీసుకొని ఇల్లు కొన్నారు. కాగా రుణం వాయిదాలు చెల్లించడానికి అతడికి డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడింది.దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News July 18, 2024

పటాన్‌చెరు: మళ్లీ ఎగిరేది బీఆర్ఎస్ జెండానే: ఎమ్మెల్యే

image

ఒక్క ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీ పోయినట్టు కాదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కార్యకర్తలే పార్టీకి కొండంత బలం అన్నారు. బీఆర్ఎస్ పదేండ్లు అద్భుతమైన పాలన అందించిందన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

News July 18, 2024

సంగారెడ్డి: హాట్ టాపిక్‌గా మారిన హరీశ్ రావు TRS కండువా.!

image

పటాన్ చెరులో నిర్వహించిన సమావేశంలో సిద్దిపేట MLA మాజీ మంత్రి హరీశ్ రావు TRS కండువాతో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్ మారుస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు టీఆర్ఎస్ కండువా ధరించి కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి మునుపటి ఫామ్ రావాలంటే.. పార్టీ పేరు నుంచి మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.

News July 17, 2024

సిద్దిపేట: దేశంలో ఇదే తొలిసారి: మంత్రి పొన్నం

image

దేశంలో రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని చేయడం ఇదే మొదటిసారి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ నిర్ణయంలో కేబినెట్ మంత్రిగా తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. మరికొన్ని గంటల్లో రైతు జీవితంలో ఆనందం గడియలు మొదలు కానున్నాయని అన్నారు. ఒకేసారి రైతు పేరు మీద ఉన్న రుణాన్ని 3 పద్ధతుల్లో మాఫీ చేస్తున్నామని తెలిపారు.