Medak

News July 17, 2024

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద రైతులపై దాడులు: హరీశ్‌రావు

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా భూమిని లాక్కుంటున్నారని ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్న ధమక్కపల్లి కిష్టయ్యను పరామర్శించారు. కాంగ్రెస్ ఇష్ట రాజ్యాంగ పేద రైతుల భూముల మీద దాడులు చేస్తున్నారని అన్నారు.

News July 17, 2024

రామచంద్రాపురం: మాజీ మంత్రి హరీష్ రావును సన్మానించిన నేతలు

image

రామచంద్రాపురం డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును ఘనంగా సన్మానించారు. మాజీ మంత్రి హరీష్ రావును మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, కృష్ణ కాంత్, పఠాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ శాలువతో సన్మానించి బొకే అందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీధర్ చారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

News July 17, 2024

సిద్దిపేట: ఘోరం.. బాలుడిని 20 నిమిషాలు కరిచిన కుక్కలు

image

HYD జవహర్‌నగర్ పరిధిలో కుక్కల దాడిలో <<13644434>>బాలుడు మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులు నెల కిందట HYD వచ్చారు. వారి కొడుకు నిహాన్ మంగళవారం రాత్రి ఇంటి ఎదుట ఆడుకుంటున్న సమయంలో గుంపుగా వచ్చిన కుక్కలు దాడి చేసి 20 నిమిషాలు కరిచాయి. అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి కుక్కలను తరిమాడు. బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.

News July 17, 2024

పుల్కల్: డెడ్‌స్టోరేజీ దిశగా నల్లవాగు ప్రాజెక్టు

image

సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళనకర స్థాయిలో పడిపోతుండటం రైతులను కలవరపెడుతుంది. నల్లవాగు ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరింది. సింగూరు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 29.917 TMCలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 13.565 TMCలుగా ఉన్నాయి.

News July 17, 2024

ఓడీఎఫ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎంపీ రఘునందన్

image

ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్(ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఆయన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడి ఇన్ఫెక్షన్ బంగ్లాలో సీజీఎం శివశంకర ప్రసాద్, జీఎం లతోపాటు ఇతర ప్రతినిధులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఓడీఎఫ్ సమస్యలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు వివరిస్తానని రఘునందన్ అన్నారు.

News July 17, 2024

సంగారెడ్డి: ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని దాడి.. తండ్రి మృతి

image

ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్న తండ్రిని కొడుకు హత్య చేసినట్లు కంగ్టి ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని చౌకన్పల్లికి చెందిన మారుతిని తన కొడుకు నరసప్ప డబ్బులు అవసరమని మంగళవారం అడిగాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో కోపోద్రిక్తుడై నరసప్ప ఆవేశంతో గొడ్డలితో తండ్రిపై దాడి చేశారు. మారుతికి చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News July 17, 2024

ఆర్డినెన్స్ అధికారులతో మెదక్ ఎంపీ సమీక్ష సమావేశం

image

సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగ భద్రత, కార్మిక సమస్యలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చీఫ్ జనరల్ మేనేజర్ శివ శంకర్ ప్రసాద్, జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విజయ్ దత్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, బీఎంఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

News July 16, 2024

దుబ్బాక: పల్లె ప్రకృతి వనం వద్ద ఉరేసుకొని వ్యక్తి మృతి

image

కుటుంబ కలహాలతో వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన దుబ్బాక మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. బొప్పాపూర్ గ్రామానికి చెందిన పరశురాములు మద్యం సేవించి భార్యపిల్లలతో గొడవ పడుతుండేవాడు. ఈ నెల 13న చిన్న కూతురు మంగతో గొడవపడగా, 14న గ్రామస్థుల ఎదుట తప్పు ఒప్పుకొని మంచిగా ఉంటానని హామీ ఇచ్చాడు. అదే రోజు రాత్రి ఇంట్లోంచి వెళ్లి కనిపించలేదు. ఈ రోజు పల్లె ప్రకృతివనం వద్ద ఉరివేసుకున్నాడు.

News July 16, 2024

మెదక్: మొహర్రం పండగ శుభాకాంక్షలు

image

ముస్లింలకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రం పండుగ త్యాగానికి, స్ఫూర్తికి ప్రతీక అని, విశ్వాసం, నమ్మకం కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ చేసిన బలిదానాన్ని గుర్తుచేసుకోవటమే మొహర్రం పండుగ ప్రత్యేకత అన్నారు. మానవజాతి త్యాగం ఎంతో గొప్పదని, మంచితనం, త్యాగాన్ని గుర్తు చేసుకోవటమే ఈ పండుగ అని ఆయన పేర్కొన్నారు.

News July 16, 2024

సంగారెడ్డి: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

image

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని గొడ్డలితో కొడుకు నరికి చంపేసిన ఘటన కంగ్టి మండలం చౌకన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మొడ్డే మారుతి (65)ను, ఆయన కొడుకు నరసప్ప (20) గొడ్డలితో నరికి హతమార్చాడు. అయితే తండ్రి కొడుకుల మధ్య డబ్బుల వ్యవహారమే ఈ ఘటనకు కారణమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.