Medak

News January 30, 2025

మెదక్: GREAT.. జాతీయ స్థాయికి ఐదోసారి ఎంపిక

image

కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ కొల్చారం మండలంలో AEO గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఆయన మాట్లాడుతూ 5వ సారి జాతీయ స్థాయికి ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నాయకులు, గ్రామస్థులు అభినందించారు.

News January 30, 2025

MDK: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ బుధవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు www.bcstudycircle.cgg.gov.inలో ఫిబ్రవరి 9లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి 12 నుంచి 14 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.

News January 30, 2025

మెదక్: వేసవి విద్యుత్ ప్రణాళికపై చీఫ్ ఇంజినీర్ సమీక్ష

image

వేసవి విద్యుత్ ప్రణాళికపై రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి మెదక్ సర్కిల్ ఆఫీసులో సమీక్షించారు. వేసవిలో ప్రతి ఒక్కరూ ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, పరిశ్రమలకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ఈ వేసవి సీజన్‌లో విద్యుత్ డిమాండ్ 15 శాతం వరకు పెరుగుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు తగ్గట్లు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ మేరకు చేసే ఏర్పాట్లపై చర్చించారు.

News January 30, 2025

సంగారెడ్డి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

image

సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం PSలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కడారి తరుణ్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డికి చెందిన తరుణ్ బొల్లారంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పొక్సో, అట్రాసిటీ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.

News January 30, 2025

ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహణకు అనుమతి

image

వివిధ స్థాయిల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను ఉచితంగా ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించడానికి అనుమతించినట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు సుంకరి కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యా శాఖధికారి ప్రొ. రాధాకిషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు. అవసరమైన సూచనలు జారీ చేశారన్నారు.

News January 29, 2025

సీపీఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యురాలిగా నర్సమ్మ

image

మెదక్ జిల్లాకు చెందిన సీపీఎం సీనియర్ నాయకురాలు కడారి నర్సమ్మ.. పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీపీఎం రాష్ట్ర 4వ మహాసభల్లో బుధవారం ఆమెను రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యురాలుగా నియమిస్తూ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని నర్సమ్మ అన్నారు.

News January 29, 2025

క్రీడలకు ఎంపికైన ఉద్యోగులకు కలెక్టర్ అభినందనలు

image

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని వివిధ శాఖల ఉద్యోగులను కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యా, వ్యవసాయం, పంచాయతీ విభాగాల ఉద్యోగులను శాలువాలతో కలెక్టర్ సత్కరించారు. ఈనెల 24, 25న HYDలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో జిల్లా తరఫున 20 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు.

News January 29, 2025

ఇందిరా మహిళా శక్తి పథకం బలోపేతానికి చర్యలు

image

ఇంరిరా మహిళ శక్తి పథకంబలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మెప్మా పీడీ ఇందిర తెలిపారు. మెదక్ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో మెప్మా సిబ్బంది, జిల్లా రిసోర్స్ పర్సన్ పర్సన్‌తో లింకేజీ, లక్ష్యాలు, సాధించిన ప్రగతి సంబంధిత అంశాలపై సమీక్షించారు. ఇందిరా మహిళ మహిళా పథకం క్రింద మంజూరైన యూనిట్లను బలోపేతం చేసి వాటికి మార్కెటింగ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

News January 28, 2025

ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్య అందించాలి: కలెక్టర్

image

ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్య అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు.బుధవారం విద్యాశాఖ సమీక్ష చేశారు. మెదక్ జిల్లా ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక స్థాయి విద్యాబోధన పురోగతిపై సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ సభ్యులు కలెక్టర్ కు వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోవు విద్యా సంవత్సరంలో మొదటి, ద్వితీయ తరగతి నుండి స్థాయి గుణాత్మక విద్య అందించే దిశగా అడుగులు వేయాలి.

News January 28, 2025

వెల్దుర్తి: పొలంలో పడి యువరైతు మృతి

image

పొలం పనులకు వెళ్లిన ఓ యువ రైతు ప్రమాదవశాత్తు పొలంలో పడి మృతి చెందిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. హకీంపేటకు చెందిన పత్తి చేతన్(35) మంగళవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.