India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాఘ అమావాస్య సందర్భంగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గా మాత ముస్తాబయ్యింది. మంజీరా నది పాయల్లో సుమారు లక్ష మంది పుణ్య స్నానాలు ఆచరించేందుకు రానున్నారు. ఈనెల 29న మాఘ అమావాస్య సందర్భంగా మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రం బీదర్, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలివస్తారు. రాజ గోపురం నుంచి ఆలయం వరకు భక్తుల కోసం క్యూలైన్ ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రేపటి నుంచి తూప్రాన్ పట్టణంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ గంగాల తెలిపారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి 320 మంది క్రీడాకారులు, 40 మంది కోచ్, మేనేజర్లు పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన సర్వే ద్వారా మెదక్ జిల్లాలోని 21 మండలాలు, వివిధ గ్రామాలలో గత ప్రభుత్వంలో ఉన్న రిజర్వేషన్లకు ఇప్పుడు రాబోవు స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు మారన్నట్లు సమాచారం. ఒకవేళ రిజర్వేషన్లు మారితే ఎవరికీ ప్లస్ పాంట్ అవుతుందో, ఎవరికి మైనస్ పాయింట్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ ఉండబోతుందని సమాచారం.
కాకతీయ కాలం వరకు ఒక వెలుగు వెలిగిన జైనం మెల్లిగా తన ప్రభావాన్ని కోల్పోసాగిందని చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ పేర్కొన్నారు. ఎన్నో అద్భుతమైన జైన దేవాలయాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం మెదక్ జిల్లాలో మనకు మూడు జైన విగ్రహాలు, ఒక విగ్రహం పెద్ద బండరాయికి చెక్కిబడి ఉంది. వెరసి నాలుగు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఒకటి తల, మొండెం వేరుగా ధ్వంసం చేసి ఉందని సంతోష్ వివరించారు.
మెదక్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, సంబంధిత అధికారులతో కలిసి జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించడంపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 6,660 మంది ఫస్ట్ ఇయర్, 6418 మంది సెకెండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం 12,484 మంది ప్రయోగ పరీక్షకు హాజరు కానున్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన యువకుడు రాజు కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 20న ఇంటి నుంచి వెళ్లి ఇంతవరకు తిరిగిరాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఈరోజు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 రైతులకు రూ.14.06 కోట్లు రైతు భరోసా కింద అకౌంట్లలో జమ అయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 4 పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి. అకౌంట్లలో డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ప్రజావాణి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సింది సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలని సూచించారు.
అనుమానస్పదంగా బావిలో మృతదేహం లభ్యమైన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అప్పాజీపల్లికి చెందిన రాములు(45) నడిమి తండాకు చెందిన ఓ వ్యక్తి వద్ద 15 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. రాములు 15 రోజుల నుంచి కనిపించకుండా పోయి బావిలో మృతి చెంది ఉన్నాడు. అతని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లాలో గల నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ నగేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నేటితో మున్సిపాలిటీల పదవీ కాలం ముగుస్తుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. మెదక్‌తో పాటు నర్సాపూర్, తుప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ నగేష్ (లోకల్ బాడి)ను నియమించారు.
Sorry, no posts matched your criteria.