Medak

News July 14, 2024

సంగారెడ్డిలో రేపు ప్రజావాణి

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 15న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా సమస్యలపై వినతి పత్రాలను స్వీకరిస్తామని చెప్పారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

News July 14, 2024

ప్రతి పారిశ్రామికవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలి: బీఎంఎస్

image

కనీసం పెన్షన్లు రూ.5000లకు పెంచాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుక్ మాండవియాకు ఆదివారం న్యూఢిల్లీలో జాతీయ బీఎంఎస్ ప్రతినిధులు తెలిపారని జిల్లా కార్యదర్శి పి. మోహన్ రెడ్డి సంగారెడ్డిలోని జిల్లా కార్యాలయంలో తెలిపారు. సీలింగ్ పెంపు వల్ల అధిక సంఖ్యలో కార్మికులకు పథకాలు వర్తిస్తాయని, ప్రతి పారిశ్రామిక వాడలో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారని వారు చెప్పారు.

News July 14, 2024

మెదక్: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం

image

సైబర్ నేరగాళ్ల వలలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మోసపోయిన ఘటన అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. అమీన్‌పూర్ పరిధిలోని గ్రీన్‌ విడోస్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి మే 19న ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. లింక్ ఓపెన్ చేసి రూ.6.49లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు లాభాలు ఇవ్వాలని అడగ్గా స్పందించలేదు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News July 14, 2024

తూప్రాన్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాలు.. బోసమైన గాయత్రి(17) గజ్వేల్ మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరంలో ఫెయిల్ కావడంతో నిన్న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ బ్యాగ్‌లో వెతకగా టీసీ కనిపించడంతో ఫెయిలైన కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 14, 2024

సిద్దిపేట నుంచి అరుణాచలగిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

image

సిద్దిపేట నుంచి ఈనెల 19న సాయంత్రం 4 గంటలకు అరుణాచలగిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డీఎం సుఖేందర్‌రెడ్డి తెలిపారు. కాణిపాకం, వేలూరు శ్రీ మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్, పౌర్ణమి రోజున అరుణాచలగిరి ప్రదక్షిణ, 22న జోగులాంబ శక్తిపీఠం దర్శనం ఉంటుందని వివరించారు.

News July 13, 2024

ఒకటో తేదీ చెల్లింపులు ఉత్త మాట: హరీశ్‌రావు

image

ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తుందని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. దీంతో ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నామన్న మాటలు కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయ‌ని తెలిపారు. మోడల్ స్కూల్ టీచర్ల‌కు గత 7 నెలల నుంచి ఏ నెలలో కూడా 1వ తేదీన వేతనాలు చెల్లించలేదని మండిపడ్డారు.

News July 13, 2024

మెదక్: ఆరుక్వింటాళ్ల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు స్వాధీనం

image

కంది మండలం జుల్కల్‌లో ఆరు క్వింటాళ్ల నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ అశోక్ తెలిపారు. కంది మండలం ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్ కుమార్,  ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ తనిఖీల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు బయటపడినట్లు చెప్పారు. నకిలీ అల్లం పేస్టును సీజ్ చేసినట్లు తెలిపారు.

News July 13, 2024

MDK: వాళ్లు BRSలోనే ఉంటారా..? జోరుగా చర్చ..!

image

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే 9 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఉమ్మడి మెదక్‌లో KCR, హరీశ్‌రావు సహా మరో ముగ్గురు BRS ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా మరికొందరు MLAలు తమ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ శ్రేణులు అంటుండడంతో ఆ ముగ్గురిలో ఎవరైనా చేరుతారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. దీనిపై మీ కామెంట్?

News July 13, 2024

24న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

image

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ హుస్సేన్ తెలిపారు. ఇంటర్మీడియట్‌లోని అన్ని గ్రూపులలో పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి కావలసిన రెజ్యూమ్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఫోటో తీసుకొని రావాలని సూచించారు. 7893822745, 9951101545, 9490065269లలో సంప్రదించాలని తెలిపారు.

News July 13, 2024

BREAKING: సంగారెడ్డి: భూమి కోసం రక్తమొచ్చేలా కొట్టుకున్నారు..!

image

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన ఈరోజు వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు PS పరిధి ముత్తంగి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు భూ వివాదంలో శుక్రవారం ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో అన్నదమ్ములు విచక్షణారహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో వారిలో ఒకరైన కర్రోళ్ల మల్లేశ్‌కు తీవ్ర గాయాలవగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.