India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణలోని వివిధ గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు మెదక్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్యాడ్‌తో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటోలతో రావాలని సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే పరీక్షలకు ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

మెదక్ జిల్లాలో పవిత్రమైన ఏడుపాయల జాతర నిధులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారనుంది. ఈనెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జాతర జరగనుంది. జాతరకు సుమారుగా 15 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వం రెండు కోట్లను మంజూరు చేస్తుంది. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది.

27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్త్, ఏడుపాయల జాతరపై మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు బందోబస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద పరిస్థితుల వివరాలను సేకరించాలన్నారు. మెదక్ జిల్లాలో 21 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని, వాటికీ ఆయుధాలు కలిగిన 8 రూట్ మొబైల్ పార్టీలు విధులు నిర్వహిస్తాయన్నారు. జాతర కోసం సూచనలు చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్‌గా ఇవ్వాలని మంత్రి దామోదర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ తర్వాతా మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు.

హవేలీ ఘన్పూర్ మండలం కేంద్రం మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను, సరుకుల నిల్వ రిజిస్టర్లును, అకౌంట్ రిజిస్టర్లను పరిశీలించి, ఎప్పటికప్పుడు సక్రమంగా రిజిస్టర్‌లను నిర్వహించాలని, ప్రతి రోజూ సమయపాలన ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపికైంది. మొత్తం 6 పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన వాటిలో మెదక్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలు పెంపుకై పిల్లలు చదవడం, రాయడం సంబంధించి పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఈ ల్యాబ్‌లో కృత్రిమ మేధా సాఫ్ట్ వేర్ పొందుపరుస్తారు.

రామాయంపేట శివారులోని జాతీయ రహదారి సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న 1421 సర్వే నంబర్‌లోని వ్యవసాయ పొలం వద్ద గత రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఉదయం లేగదూడను చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు, పోలింగ్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా ఉండాలన్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లో జరిగింది. హవేలిఘనపూర్ మండలం గంగాపురానికి చెందిన శ్రీనివాస్ ఓ శుభకార్యం నిమిత్తం బిక్కనూరులోని అత్తగారింటికి వచ్చాడు. శుక్రవారం మద్యం తాగి ఆరు బయట పడుకున్న శ్రీనివాస్ తెల్లవారుజామున భార్య సరిత వచ్చి నిద్రలేపగా లేవలేదు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సిద్దిపేటలో వ్యక్తి<<15521843>> హత్య కేసు<<>>ను పోలీసులు ఛేదించారు. హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు ACP మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు కరీంనగర్ జిల్లాకు చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.