India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిద్దిపేట జిల్లాలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్లు చేర్యాల సీఐ శ్రీను తెలిపారు. మద్దూరు మండలానికి చెందిన 16 ఏళ్ల బాలికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గీసుకొండ మండలం రెడ్డిపాలెంకు చెందిన కొండేపోగు మధుబాబు (23) కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్టు వివరించారు. ఈ ఘటనలో మధుబాబును నిన్న అరెస్టు చేసినట్లు సీఐ శ్రీను వివరించారు.
వరి నాట్లకు కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు వలస కూలీల మీద ఆధారపడుతున్నారు. వరినాట్లు వేసేందుకు మూడు, నాలుగేళ్ళుగా బిహార్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాల నుంచి కూలీలు నాట్లు వేసేందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామానికి బిహార్‌కు చెందిన మగ కూలీలు వందమందికి పైగా వచ్చి నాట్లు వేశారు.
సంగారెడ్డి పట్టణంలో అద్వాన్న పారిశుధ్యంపై మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్‌పై కలెక్టర్ వల్లూరు క్రాంతి చేశారు. సంగారెడ్డి లోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కమిషనర్ ప్రతిరోజు ఉదయం వాటిలో పర్యటించి శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వీధి కుక్కలు ఎక్కువగా తిరిగే కాలనీలో చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మండల పరిధిలోని గజ్వాడ గ్రామంలో చేను పనులు చేస్తుండగా గుర్ల రామమ్మకు పాము కాటు వేసింది. అక్కడే ఉన్న భర్త మల్లేశం, కుమారుడు రాజు అంబులెన్స్ కొరకు ప్రయత్నించగా అంబులెన్స్ అందుబాటులో రాలేదు. చేను వరకు ఆటో పిలిపించుకొని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆలస్యం కావడంతో రామమ్మ మృతి చెందింది. అంబులెన్స్ అందుబాటులో ఉంటే తన భార్య ప్రాణం దక్కేదని భర్త మల్లేశం బోరున వినిపించాడు.
రవి అడ్వకేట్ పై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చినందున టూ టౌన్ ఏఎస్ఐ ఉమారెడ్డిని సిద్దిపేట టూ టౌన్ నుంచి జిల్లా కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారని అడిషనల్ డిసిపి యస్.మల్లారెడ్డి తెలిపారు. అడ్వకేట్ పై దాడి విషయంలో టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ ఉపేందర్‌పై ఆరోపణలు రాగా గజ్వేల్ ఏసిపి కే.పురుషోత్తంరెడ్డిని విచారణ అధికారిగా నియమించామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.
మెదక్ స్టేడియంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. మెదక్ ఆర్డీవో రమాదేవి, తహశీల్దార్ శ్రీనివాసరావులతో కలిసి క్షేత్ర పర్యటనలో భాగంగా స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలను చేశారు. సీసీ టీవీల పర్యవేక్షణ, సెక్యూరిటీ పకడ్బందీగా నిర్వహించాలని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల అధికారులకు సూచించారు.
సంగారెడ్డి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి గంజాయి, మాదకద్రవ్యాలు తరలిస్తున్నారా పరిశీలించారు. జిల్లాలో ఎవరైనా మాదకద్రవ్యాలు, గంజాయి తరలిస్తే 87126 56777 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్పీ రూపేష్ సూచించారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
సంగారెడ్డి DCC అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఈరోజు TGIIC కార్పొరేషన్ ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తంకుమార్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తనకు కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలకు నిర్మలా జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
HYDలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీకాం, బీబీఎం పాసై 28 ఏళ్ల వయసు మించని వారు అర్హులు. పోస్టును అనుసరించి రూ.21,500 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది. జులై 11 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://bel-india.in/job-notifications/ వెబ్‌సైట్ చూడండి. SHARE IT
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెలలో ప్రారంభం కానున్న హెచ్సీఏ బీ1 డివిజన్ 2-డే లీగ్‌లో పాల్గొనేందుకు అండర్-25 ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఎంపిక చేయనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి లోని జూబ్లీక్లబ్ ప్రాంగణంలోని ఎంఎస్ అకాడమీలో ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.