Medak

News July 11, 2024

రేపు మెదక్ జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెలలో ప్రారంభం కానున్న హెచ్సీఏ బీ1 డివిజన్ 2-డే లీగ్‌లో పాల్గొనేందుకు అండర్-25 ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును ఈ నెల 12న ఉదయం 10 గంటలకు ఎంపిక చేయనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి లోని జూబ్లీక్లబ్ ప్రాంగణంలోని ఎంఎస్ అకాడమీలో ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.

News July 11, 2024

సిద్దిపేట: చికిత్స పొందుతూ బాడీ బిల్డర్ మృతి

image

సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాడీ బిల్డర్ సోహైల్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వారం రోజుల క్రితం మిరుదొడ్డి ప్రాంతంలో మరో యువకుడితో కలిసి క్రికెట్ ఆడి ద్విచక్ర వాహనం పై తిరిగి సిద్దిపేటకు వస్తుండగా ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సోహైల్ మృతి చెందాడు.

News July 11, 2024

అమ్మా ఆకలేస్తుంది.. నాన్న నిద్రొస్తుంది లే.. చిన్నారుల కన్నీటి మాటలు

image

అమ్మా లే ఆకలేస్తుందమ్మా.. నాన్నా లే నిద్రిస్తుందిలే నాన్నా.. అంటూ చిన్నారులు <<1360251>>తల్లిదండ్రుల మృతదేహాల<<>> వద్ద అంటున్న మాటలు పలువురిని కంట తడి పెట్టించాయి. జగదేవ్పూర్ మండలం ఇటిక్యాలకు చెందిన దంపతులు కరకపట్ల శేఖర్, సౌమ్య పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం ఇంటికి వచ్చిన మృతదేహాల వద్ద లెమ్మంటూ చిన్నారులు శివాన్స్, బంటు మాటలు పలువురిని కన్నీరు పెట్టించాయి.

News July 11, 2024

సిద్దిపేట: టీచర్ల పాదాలు కడిగి వీడ్కోలు

image

సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ యూపీఎస్ పాఠశాలలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఉపాధ్యాయులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు టీచర్ల కాళ్లు కడిగారు. పాఠశాలలలో 43 మంది విద్యార్థులు ఉండగా.. ఉపాధ్యాయులు శైలజ, హరిత, భాగ్యమ్మ, శ్రీకాంత్ కృషితో ప్రస్తుతం ఆ సంఖ్య 178 మందికి చేరిందని చెప్పారు.

News July 11, 2024

సంగారెడ్డి: గ్రూప్-1 మెయిన్స్ ఫ్రీ కోచింగ్

image

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ బుధవారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 17 వరకు వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థి కుటుంబ వార్షికోత్సవం రూ.5 లక్షల లోపు ఉండాలని చెప్పారు. కోచింగ్ సమయంలో నెలకు రూ. 5000 స్టైపాండ్ చెల్లిస్తారని తెలిపారు.

News July 10, 2024

తూప్రాన్: రాజధాని బస్సులో భారీ నగదు చోరీ

image

తూప్రాన్ పట్టణ శివారులోని హైవే బైపాస్‌లో రాజధాని బస్సులో భారీ నగదు చోరీ జరిగినట్లు ఎస్సై శివానందం తెలిపారు. కొంపల్లికి చెందిన మసాలా వ్యాపారి అమీన్ అబ్దుల్ లాలా నిజామాబాద్ నుంచి రాజధాని ఆర్టీసీ బస్సులో రూ.5 లక్షల నగదుతో కొంపల్లికి వెళ్తున్నారు. తూప్రాన్ దాబా వద్ద బస్సు ఆగగా భోజనానికి దిగి వచ్చే సరికే నగదు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది.

News July 10, 2024

HYD ఈస్ట్ జోన్‌కు మెదక్ ఎస్పీ బదిలీ

image

మెదక్ ఎస్పీ డా.బి. బాలస్వామి బదిలీ అయ్యారు. బాలస్వామి జనవరి 6న మెదక్ ఎస్పీగా బదిలీపై వచ్చారు. తాజాగా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, ఈస్ట్ జోన్, హైదరాబాద్‌‌కు బదిలీ చేస్తు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో మెదక్ నూతన ఎస్పీగా డి. ఉదయ్‌కుమార్ రెడ్డిని నియమించారు. మెదక్‌లో ఇటీవల జరిగిన అల్లర్లే ఎస్పీ డాక్టర్ బాలస్వామి బదిలీకి కారణంగా జిల్లాలో చర్చనీయాంశమైంది.

News July 10, 2024

సంగారెడ్డి: రేపటి టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం వాయిదా

image

ఈనెల 11న నిర్వహించాల్సిన టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం వాయిదా వేసినట్లు జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ బుధవారం తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తున్నందున సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News July 10, 2024

సిదిపేట: విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య !

image

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శేఖర్(31), సౌమ్య మణి(28) దంపుతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News July 10, 2024

గంగాపూర్: అంబులెన్స్‌లో ప్రసవం..

image

హవేలి ఘనపూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మన్నె మల్లేశం భార్య కల్పనకు పురిటి నొప్పులు రాగా అంబులెన్స్‌కు సమాచారం తెలిపారు. మెదక్ MCH ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కాగా EMT శ్రీహరి డెలివరీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. వారిని మెదక్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు పేర్కొన్నారు. పైలెట్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.