India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొల్చారం శివారులో అదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీంతో బైక్ పై ఉన్న కౌడిపల్లి మండలం కన్నారం గ్రామానికి చెందిన రాజేందర్(27) అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్ నుంచి తన స్వగ్రామం కన్నారం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు.

శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామ శివారులోని భవ్యస్ ఫార్మసిటికల్ కంపెనీలో ఈనెల 15న జరిగిన చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పరిశ్రమలో అర్ధరాత్రి వేళ ఇనుప సామాగ్రి చోరి చేయగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుమ్మడిదల గ్రామానికి చెందిన వెంకటేష్, ఆంజనేయులు, బ్రహ్మచారి, ధర్మేందర్లను అరెస్ట్ చేసి డిమాండ్‌కు తరలించారు.

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో మెనూ పగడ్బందీగా అమలు చేయడం హర్షనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ రైల్వే స్టేషన్ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించారు. ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 17 సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి వినతులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలిపిచేడ్‌లో జరిగింది. ఎస్ఐ నర్సింహులు వివరాలు.. HYDకి చెందిన జగన్ రావు(60) భార్య మూడు నెలల కింద మృతి చెందడంతో మనస్థాపం చెంది మండలంలోని చిట్కుల్ శివారులో చాముండేశ్వరీ ఆలయ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు సంతోశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తమ్ముడిని హత్య చేసిన అన్నను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. మునిపల్లి మండలం చీలపల్లి చెందిన శివయ్యను శుక్రవారం సాయంత్రం తన అన్న యాదయ్య హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం యాదయ్య పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. విచారణలో శివయ్యను బండరాయితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడని, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

మ్యాట్రిమోని పేరుతో అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చేర్యాల సీఐ తెలిపిన వివరాలు.. కర్నూల్‌కు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత అమ్మాయి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మోస పోయిన అమ్మాయి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు.

పదవ తరగతి విద్యార్థులకు ప్రాక్టీస్-2 పరీక్షలు ఈనెల 17 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ నెల 17న తెలుగు, 18న హిందీ, 19న ఇంగ్లీష్, 20న గణితం, 21న భౌతిక రసాయన శాస్త్రం, 22న జీవశాస్త్రం, 24న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.

ఈ నెల 16 నుంచి 28 వరకు సామాజిక, ఆర్టిక, విద్య, ఉపాది, రాజకీయ కుల సర్వే లో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. టోల్ ఫ్రీ, ప్రజాపాలన సేవా కేంద్రాలు, ఆన్లైన్ ఫామ్ డౌన్లోడ్ చేసి సమర్పించడం ద్వారా పాల్గొనవచ్చన్నారు. శనివారం జిల్లాలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ పాల్గొన్నారు.

రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్ మహమ్మారి బారీన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన నార్కోటిక్ కో-ఆర్డినేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ జిల్లా ఎస్పీ పాల్గొని పలు అంశాలపై సూచనలు చేశారు. యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.