Medak

News June 10, 2024

రైతుబంధుపై కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు !

image

తెలంగాణలో రైతులు వానాకాలం పనులు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నంగునూరు మండలం అక్కనపల్లిలో మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వర్షం పడగానే రైతుబంధు ఇచ్చేదని .. కానీ రేవంత్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు.

News June 10, 2024

మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో మెదక్ ఎంపీ

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడవ సారి ప్రమాణ స్వీకారోత్సవంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో జరిగిన ప్రధాని మోదీ, మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గొడెం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

News June 9, 2024

SRD: జాతీయ పురస్కారం అందుకున్న టీచర్ రామకృష్ణ

image

సదాశివపేట మండలానికి చెందిన నిజాంపూర్( కె) పాఠశాల ఉపాద్యాయులు డా. రామకృష్ణ (విద్యా సామాజిక చైతన్యం కృషి) జాతీయ బంగారు కామధేనువు పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వ సాంసృతిక శాఖ సౌజన్యంతో GCS వల్లూరి ఫౌండేషన్ గ్రూప్ జాతీయ బంగారు అవార్డుల ప్రదానోత్సవ రవీంద్రభారతిలో జరిగింది. BC కార్పొరేషన్ ఛైర్మన్ వాకుళాబరణం కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై పురస్కారం అందజేశారు.

News June 9, 2024

మెదక్: అదృశ్యమైన మహిళ.. అడవిలో మృతదేహం

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన బాగమ్మ(55) అనే వృద్ధురాలు గత నెల 1న అడవిలో వంట చెరుకు తేవడానికి వెళ్లి అదృశ్యమైంది. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అడవి ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది బాగమ్మ మృతదేహంగా గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టారు.

News June 9, 2024

సంగారెడ్డి: ఫెడరేషన్ బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి

image

ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా సంగారెడ్డికి చెందిన న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన మాట్లాడుతూ.. తనలో రెండోసారి ఈ పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

News June 9, 2024

జోగిపేట శివారులో మొసలి కళేబరం

image

జోగిపేట శివారులో మృతి చెందిన మొసలిని స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పట్టణంలోని రాజరాజేశ్వరి ఆలయం ససమీపంలోని అటవీ ప్రాంత కాలువల్లో నుంచి వచ్చిన మొసలి అక్కడే మృతి చెందింది. రెండు, మూడు రోజుల క్రితమే ఇది చనిపోయి ఉండొచ్చని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News June 9, 2024

రావి ఆకుపై మోడీ 3.0 చిత్రాలు

image

మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మూడో మారు ప్రధాన మంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీ చరిత్ర పుటల్లో ఎక్కారు. గ్లోబల్ లీడర్ రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడు, ఈ రోజు ఢిల్లీలో 3వ సారి భారత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోదీకి నారాయణఖేడ్‌కు చెందిన ఆర్టిస్ట్ శుభాకాంక్షలు చెప్పారు. రావి ఆకులపై ఆయన చిత్రాలు రూపొందించి అభిమానాన్ని చాటుకున్నాడు.

News June 9, 2024

MDK: 25 ఏళ్ల అనంతరం వరించిన విజయం

image

మెతుకు సీమలో 25 ఏళ్ల అనంతరం కాషాయ జెండా రెపరెపలాడింది. లోక్‌సభ స్థానం ఏర్పడిన అనంతరం BJPకి ఇది రెండో విజయం. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆలే నరేంద్ర BRS నుంచి బరిలో దిగి విజయం సాధించారు. అప్పటి నుంచి 2019 వరకుగెలుపొందుతూ వచ్చింది. వరుసగా 5సార్లు గెలిచినా (ఉపఎన్నికతో కలిపి) ఈసారి చతికిలపడిపోయింది. ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం కావడం పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.

News June 9, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో బదిలీలకు రంగం సిద్ధం

image

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుంది. జిల్లాస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులు బదిలీ కానున్నారు. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పని చేసిన అధికారులకు స్థాన చలనం తప్పకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో జిల్లాల్లో మంచి పోస్టింగ్‌ల కోసం అప్పుడే స్థానిక కాంగ్రెస్‌ నాయకుల ద్వారా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రుల వద్దకు అధికారులు పరుగులు తీస్తున్నారు.

News June 9, 2024

MDK: పరీక్ష రాయనున్న 25,263 మంది అభ్యర్థులు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 21,762 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకు 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 నుంచి మ.1 గంట వరకు పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉ.9 గంటల లోపు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.10 గంటల వరకు అనుమతించి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గేట్లు మూసివేసి అభ్యర్థులను అనుమతించరని పేర్కొన్నారు.