Medak

News February 13, 2025

ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

image

మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నూతనంగా నియమితులైన పోలీస్ సిబ్బందికి రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మహేందర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఈఐఆర్, ఐఆర్ఏడి సైబర్ అవేర్‌నెస్, ఈ ఛానల్ పై వారికి శిక్షణ ఇచ్చారు.

News February 13, 2025

MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

News February 13, 2025

మెదక్: లేగ దూడపై చిరుత దాడి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో చిరుత పులి సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన దాసరి పెద్ద ఎల్లయ్య వ్యవసాయ పొలం వద్ద పశువులపాకపై చిరుత పులి దాడి చేసి ఒక లేగ దూడను చంపేసింది. ఉదయం పశువుల పాకకు వెళ్లిన రైతు లేగ దూడపై చిరుత దాడిని గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరారు.

News February 13, 2025

MDK: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

image

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.

News February 13, 2025

MDK: అనారోగ్యంతో మహిళా కానిస్టేబుల్ మృతి

image

సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పైసా స్వప్న కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. దీంతో స్వప్న స్వగ్రామమైన వీరన్నపేటలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆమె మృతి పట్ల సీఐ ఎల్ శ్రీను, ఎస్ఐ నీరేష్, పోలీస్ సిబ్బంది, పలువురు నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.

News February 13, 2025

మెదక్: తండ్రి మందలించడంతో కొడుకు సూసైడ్

image

చేగుంట మండలం వడియారం గ్రామంలో మద్యం తాగొద్దని తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఘన బోయిన శివకుమార్ అలియాస్ శివుడు(30) నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో శివుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి పురుగు మందు తాగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఇవాళ మృతి చెందాడు.

News February 13, 2025

MDK: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి 3ఏళ్ల జైలు

image

కోహిర్ మండలంలో 2021 ఫిబ్రవరిలో 17ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు బేగరి ఆంజనేయులకు పోక్సో కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోక్సో జడ్జి కే.జయంతి నిందితుడిని దోషిగా తేల్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన పలువురిని ఎస్పీ అభినందించారు.

News February 13, 2025

చేగుంట: తండ్రి మందలించడంతో కొడుకు సూసైడ్

image

చేగుంట మండలం వడియారం గ్రామంలో మద్యం తాగొద్దని తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఘన బోయిన శివకుమార్ అలియాస్ శివుడు(30) నిన్న రాత్రి మద్యం తాగి ఇంటికి రాగా తండ్రి మందలించాడు. దీంతో శివుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి పురుగు మందు తాగడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ఇవాళ మృతి చెందాడు.

News February 13, 2025

ఉన్నత స్థానంలో స్థిరపడాలి: అడిషనల్ కలెక్టర్

image

ప్రతి విద్యార్థి బాగా చదువుకొని జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆకాంక్షించారు. హవేలీ ఘన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మమేకమై మెనూ పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. పిల్లల బాగోగులు తెలుసుకున్నారు.

News February 13, 2025

మెదక్: కాంగ్రెస్‌లో చేరిన మాజీ డీఎస్పీ 

image

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎం.గంగాధర్ బుధవారం ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల గంగాధర్ డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నాలుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు.