India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో వన మహోత్సవ లక్ష్యసాధనకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 35.88 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ జ్యోతి, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని దొంగిలించి అందులో ఉన్న నగదు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామంలో జరిగింది. 161 జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ దేవాలయంలో పలుమార్లు దొంగతనాలు జరుగుతున్నాయి. 3సార్లు దొంగతనాలు జరిగినట్లుగా స్థానికులు తెలిపారు.
క్షణికావేశంతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు మందలిచండంతో రాయపోల్ మండలం ఎల్కల్‌కు చెందిన రాజు(24) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన జాల యాదయ్య(56) చేసిన అప్పులు తీరక సూసైడ్ చేసుకోగా.. అక్కన్నపేటకు చెందిన తంగళ్లపల్లి సాగర్(23)వ్యక్తిగత కారణాలతో ఉరేసుకున్నాడు.
HYD జగద్గిరిగుట్ట PS పరిధిలో <<13530512>>అనిల్ అనే వ్యక్తి<<>> హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ DCP సురేశ్ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. మెదక్ జల్లా అల్లాదుర్గం వాసి అనిల్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్నాడు. దీంతో భార్య భాగ్యలక్ష్మీ భర్తను హత్య చేయించిందని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన చేర్యాలలో జరిగింది. SI దామోదర్, స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట వాసి K.చంద్రశేఖర్(59) DNT స్కూల్‌లో గెజిటెడ్ HMగా పని చేస్తున్నారు. శుక్రవారం బైక్‌పై పాఠశాలకు బయలుదేరిన ఆయనను చేర్యాల వద్ద వెనుకనుంచి వస్తున్న RTC బస్సు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన చంద్రశేఖర్‌ను HYD తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.
చెరువుల రక్షణ, సుందరీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. HYD జిల్లా పరిధిలో 28, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1078, మేడ్చల్ జిల్లాలో 620, మెదక్ జిల్లాలో 589, సంగారెడ్డి జిల్లాలో 603, సిద్దిపేట 347, యాదాద్రి భువనగిరి జిల్లాలో 267 చెరువులు ఉన్నాయి. చెరువులను అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు చేస్తున్నట్లుగా తెలిపింది.
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ మహిళా శక్తి సమావేశం శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా శక్తి లబ్ధిదారులకు అందాల్సిన రుణాలను వేగవంతం చేయాలని సూచించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్డీవో జ్యోతి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని కవిత ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్‌తో కూడిన ఉచిత శిక్షణను అందజేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 10వ తేదీ వరకు ఆన్లైన్ http://tsstudycircle.co.in/లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగింది. స్థానికులు వివరాలు.. ఎల్కల్ గ్రామానికి చెందిన మంది రాజు (35) శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలో ట్రాక్టర్లను కేజీ వీల్స్‌తో బీటీ రోడ్లు, సీసీ రోడ్లపై నడపడం వల్ల దెబ్బతింటున్నాయని, కేజీ వీల్స్‌తో ట్రాక్టర్లను రోడ్లపై నడిపిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి హెచ్చరించారు. ఎస్పీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రభుత్వం ఎంతో వ్యయంతో ప్రజలకు మెరుగైన సుఖవంతమైన ప్రయాణం కోసం రోడ్లను ఏర్పాటు చేసిందని, కేజీ వీల్స్‌తో రోడ్లు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.