India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగులను గుర్తించి అర్హతగల వారికి సదరం ధ్రువీకరణ పత్రం పొందేందుకుగానూ జులై -2024 సంబందించిన క్యాంప్ తేదీలను మీ సేవ / ఈ సేవ కేంద్రాలకు కేటాయించినట్లు డీఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ/ ఈ సేవ కేంద్రం వద్ద ఆన్ లైన్‌లో స్లాటు బుక్ చేసుకొని కేటాయించిన రోజు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, MLC గోరేటి వెంకన్న ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలన్నారు.
కొడుకు తల్లిని చంపి సహజ మరణంగా చిత్రీకరించాడు. పోలీసుల వివరాలు.. HYDకి చెందిన బాలకృష్ణమ్మ(54) కొడుకు సర్వేశ్, పక్కింటివారితో కలిసి నాచారంగుట్ట క్షేత్రానికి వచ్చింది. రాత్రి ఆమె అస్వస్థతకు గురి కాగా కొడుకు అసహనంతో తల్లి తలను నేలకేసి కొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయింది. సహజ మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంట వెళ్లిన వారి ద్వారా అసలు విషయం తెలుసుకుని ఆమె కుమార్తె సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. సిద్దిపేట(499), మెదక్(469), సంగారెడ్డి(647) జిల్లాల్లో మొత్తం 1615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆర్నెళ్లుగా పంచాయతీలకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని తెలిసింది. ఫిబ్రవరి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. ప్రత్యేకాధికారుల పాలనకు ముందే పంచాయతీల్లో నిధులు ఖాళీ అయ్యాయి.
సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోవడం, పదవీ విరమణలతో RTC సిబ్బంది తగ్గుతూ వస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో RTCలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పనిభారం తగ్గనుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాలలో 8 డిపోల్లో సుమారు 1726మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫమైందని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. గురువారం ఎర్రవెల్లిలో ఆయన నివాసానికి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కేసీఆర్ మాట్లాడారు. సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కాంగ్రెస్ కొనసాగించడం లేదని ఆరోపించారు.
ఓ ప్రైవేటు కళాశాల అధ్యాపకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన బోయిని యాదగిరి(28) ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన యాదగిరి ఎనగండ్ల శివారులో ఆత్మహత్య చేసుకున్నారు.
తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన యువకుడు గడ్డి మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. పానగంటి రమేశ్ (26) జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవించేందుకు అప్పులు చేసి, అప్పులు తీర్చే మార్గం తెలియక పది రోజుల క్రితం గడ్డి మందు సేవించాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి అర్హత సాధించినవారి జాబితాలో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 1404 సీట్లలో 330 సీట్లను సిద్దిపేట జిల్లా విద్యార్థులు సాధించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించి సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల కృషి ఫలితం అని మంత్రి పేర్కొన్నారు.
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్బంగా గురువారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి పట్టణంలో ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన నిప్పు కణిక అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.
Sorry, no posts matched your criteria.