Medak

News March 29, 2024

మెదక్ ఎంపీ అభ్యర్థులకు పటాన్‌చెరు నేపథ్యం

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దిగుతున్న మూడు పార్టీల అభ్యర్థులు పటాన్‌చెరు నేపథ్యం కలిగి ఉన్నారు. మెదక్ పార్లమెంట్‌లో పటాన్‌చెరు నియోజకవర్గం ఒకటి కాగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు జర్నలిస్టుగా, న్యాయవాదిగా పనిచేయగా, కాంగ్రెస్ అభ్యర్థి చిట్కూల్ ఇటీవల సర్పంచ్‌గా పనిచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్‌ రామారెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు.

News March 29, 2024

మెదక్ పార్లమెంట్‌లో యువతే కీలకం

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఓట్లే ఆయా పార్టీలకు కీలకంగా మారనున్నాయి. మెదక్ లోకసభ స్థానంలో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉండగా, అందులో 39 ఏళ్ల లోపు వారే 9, 52,583 మంది ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో 18-19 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్లు 53,458 మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. ఏప్రిల్ 15 వరకు నూతన ఓటర్లు నమోదు చేసుకునే వెసులుబాటును ఎలక్షన్ కమీషన్ ఇవ్వడంతో యువ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

News March 29, 2024

జహీరాబాద్ పార్లమెంట్ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు

image

జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు అభ్యర్థులను ప్రకటించింది. BJP అభ్యర్థిగా ఎంపీ బీబీ పాటిల్‌ను ప్రకటించగా.. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు సురేశ్ షెట్కార్ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ప్రకటించింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో ప్రచారం జోరందుకోనుంది.

News March 29, 2024

మెదక్: ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు

image

పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు సహకరించాలని సూచించారు.
SHARE IT

News March 28, 2024

సంగారెడ్డి: అరుదైన పక్షి ప్రత్యక్షం (PHOTO)

image

సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. గురువారం మండల కేంద్రంలోని ఓ ఇంటి‌ స్లాబ్‌ మీద వాలింది. పెద్ద పెద్ద కండ్లు, పొడవాటి ముక్కు, తెలుపు రంగు‌లో ఉంది. జనావాసాల మధ్యకొచ్చిన ఈ వింత పక్షిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు ఆశ్చర్య పడుతూ సెల్‌ఫోన్‌‌తో ఫొటోలు తీశారు.

News March 28, 2024

BRSకు షాక్.. నీలం మధుతో ఎలక్షన్ రెడ్డి (PHOTO)

image

BRS‌కు షాక్‌ తగిలింది. మెదక్ కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఇటీవల ఎలక్షన్ రెడ్డి BRSను వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో నీలం మధు, నర్సారెడ్డితో ఆయన భేటీ చర్చనీయాంశమైంది.

News March 28, 2024

కొండపాక: ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

image

కొండపాక ఎంపీపీ అధ్యక్షురాలు రాగల సుగుణ దుర్గయ్యపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బలపరీక్షలో తొమ్మిది మంది ఎంపీటీసీలు ఎంపీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. రెండ్రోజుల్లో వైస్ ఎంపీపీ పీఠానికి బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది.

News March 28, 2024

సంగారెడ్డి: బైక్, లారీ ఢీ.. యువకుడు మృతి

image

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందాడు. నిజాంపూర్ వైపు నుంచి సదాశివపేటకు బైక్ పై వెళ్తున్న యువకుడిని జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు సదాశివపేట మండలం వెల్లూర్ గ్రామస్థుడిగా గుర్తించారు.

News March 28, 2024

ఝారసంగం: BRSకు బిగ్ షాక్

image

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలానికి చెందిన 25 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ ఛైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, తదితరులు బీఆర్ఎస్‌ను వీడారు. అనంతరం జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో సుమారు 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు.

News March 28, 2024

వేడెక్కిన మెదక్‌ లోక్‌సభ రాజకీయం

image

లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురువైంది. ఇరు పార్టీలనేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ BRS నేతలు సెటైర్లు వేశారు.