Medak

News July 3, 2024

కౌశిక్ రెడ్డిపై కేసు.. హరీశ్‌రావు ఫైర్!

image

MLA పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయ‌డాన్ని MLA హ‌రీశ్‌రావు ఖండించారు. ‘ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను జడ్పీ స‌మావేశం దృష్టికి తీసుకురావ‌డ‌మే కౌశిక్ రెడ్డి చేసిన త‌ప్పా..? ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలనా..?, ఇలాంటి బెదిరింపులకు BRS భయపడదు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం’ అని హరీశ్‌రావు Xలో పేర్కొన్నారు.

News July 3, 2024

పటాన్‌చెరు: యాప్ డౌన్ లోడ్ చేయబోతే రూ.48 వేలు మాయం

image

టోల్‌గేట్ ట్యాక్స్ చెల్లించడానికి ఫాస్టాగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేయబోగా ఖాతాలో డబ్బులు మాయమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. అమీన్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి కారు ఫాస్టాగ్ రీఛార్జి చేసినా అవ్వకపోవడంతో కొత్తగా యాప్‌ను డౌన్ లోడ్ చేయబోతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి లింక్ పంపాడు. UPI నంబర్ నమోదు చేయమని చెప్పి, ముందుగా ఒక్క రూపాయి డ్రా చేశాడు. తర్వాత రూ.48.920 మాయం కాగా PSలో ఫిర్యాదు చేశాడు.

News July 3, 2024

కంగ్టి: బ్రెయిన్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి

image

బ్రెయిన్ వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. కంగ్టి మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన కోటగిరి రాజు(35) కొద్ది రోజులుగా తలలో నొప్పితో బాధపడుతూ సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఆపరేషన్ చేశారని, పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News July 3, 2024

MDK: నేటితో ముగియనున్న పదవీ కాలం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. జులై 3న మండల పరిషత్, 4న జిల్లా పరిషత్‌కు పాలకవర్గాలు కొలువుదీరాయి. 5ఏళ్ల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించనుంది. మెదక్ జిల్లాలో 189 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

News July 3, 2024

సిద్దిపేట: జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం

image

అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 23,738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాలలో ఉందని అన్నారు.

News July 2, 2024

సంగారెడ్డి: 45 మంది ఉపాధ్యాయుల బదిలీ

image

సంగారెడ్డి జిల్లాలో 45 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. లాంగ్వేజ్ పండిట్ తెలుగు 11, హిందీ 22, ఉర్దూ 1, పీఈటీలు 11 మంది బదిలీ అయినట్లు చెప్పారు. బదిలీ అయిన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలలలో ఈ నెల 3వ తేదీన చేరాలని సూచించారు.

News July 2, 2024

NKD: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

image

మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నారాయణఖేడ్‌కు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. నారాయణఖేడ్ నుంచి కారులో వెళ్లిన రఫిక్ ఖురేషి, ఫెరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్, సయ్యద్ ఇస్మాయిల్ పుణే సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 2, 2024

సంగారెడ్డిలో 4న జాబ్ మేళా

image

సంగారెడ్డిలోని బైపాస్ రహదారిలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 4న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి వందన తెలిపారు. ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఫ్యాబ్రికేషన్ చదివిన వారు అర్హులని చెప్పారు. 18 నుంచి 35 సంవత్సరంలోపు ఉన్న యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వివరించారు.

News July 2, 2024

సిద్దిపేట: పదోన్నతుల్లో SGTలకు నిరాశ !

image

ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అన్యాయం జరిగిందని SGTలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి సీనియారిటీ ప్రకారం ఇచ్చేవారని ప్రస్తుతం కోర్టు తీర్పు ప్రకారం బాషా పండితుల పదోన్నతులు ఉమ్మడి సీనియార్టీగా కాకుండా కేవలం పండితులకు ఇవ్వడంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి సీనియారిటీని TTC చేసిన వారికి వర్తింపజేయడంతో బీఈడీ చేసిన ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు.

News July 2, 2024

పటాన్‌చెరు: కరెంట్ షాక్‌తో ఆటో డ్రైవర్ మృతి

image

కరెంట్ షాక్ తగిలి ఓ ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామంలో ఉంటున్న శ్రీనివాస్ గౌడ్(46) ఆటో డ్రైవర్. సోమవారం ఆటోను తడి బట్టతో శుభ్రం చేశాడు. అనంతరం దాన్ని వైరుపై ఆరేయగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.