Medak

News February 8, 2025

మెదక్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది

image

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. మెదక్ జిల్లాలో 493 గ్రామపంచాయతీలుండగా, మొత్తం 5,25,478మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,52,797మంది, మహిళలు 2,72,672మంది ఉన్నారు. ఇతరులు 9మంది ఉన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను అనుసరించి తాజాగా గ్రామపంచాయతీ ఓటర్ జాబితాను అధికారులు సిద్ధం చేశారు.

News February 8, 2025

మెదక్: నేడు పాఠశాలలకు పనిదినం: డీఈవో

image

మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నేడు (శనివారం) పని చేస్తాయని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినందుకు, శనివారం పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు తరగతులకు గైర్హాజరు కాకుండా చూడాలని సూచించారు.

News February 8, 2025

మెదక్: పక్కడ్బందీగా ప్రత్యేక తరగతులు: డీఈవో

image

మెదక్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలని డీఈవో రాధా కిషన్ ఆదేశించారు. ఉదయం 8:15 నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. సాయంత్రం అల్పాహారం అందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 8, 2025

మెదక్: కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తి అరెస్టు

image

భార్య, బామ్మార్దిని కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేగోడ్ ఎస్ఐ పోచయ్య తెలిపారు. రేగోడ్‌కు చెందిన ద్యారంగుల వెంకయ్య ఈ నెల 3న భార్యతో గోడవపడ్డాడు. ఈ ఘటనలో భార్య నాగమణి, బావ మరిది గురువయ్యను వెంకయ్య కత్తితో పొడిచి పారిపోయాడు. గాయపడిన ఇద్దరిని సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు వెంకయ్యను శుక్రవారం అరెస్టు చేసి రిమండ్ తరలించిన పోలీసులు తెలిపారు.

News February 8, 2025

మెదక్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

image

మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 320 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన యువ అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు.

News February 7, 2025

మెదక్: అప్పుడే మండుతున్న ఎండలు

image

గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లాలో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి తొలి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. పొద్దున, సాయంత్రం చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట ఎండలు సుర్రుమంటున్నాయి.

News February 7, 2025

గజ్వేల్‌లో యాక్సిడెంట్.. ఇద్దరి దుర్మరణం

image

గజ్వేల్ పరిధిలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గోదావరిఖని నుంచి HYD వైపు వెళ్తున్న కారు, ఆగి ఉన్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండటంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

News February 7, 2025

ఆత్మహత్యలు కాదు.. కొట్లాడుదాం.. ప్రజలకు హరీశ్ రావు పిలుపు

image

లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామ సభలో పురుగు మందు తాగిన ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరమని హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ అన్నారు. ఆత్మహత్యలు వద్దు.. కొట్లాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

News February 7, 2025

సర్పంచ్ ఎన్నికలు: మెదక్ జిల్లా పూర్తి వివరాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లా అధికారులు, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన మెదక్ జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు, 4 మున్సిపాలిటీ‌లు, 21 మండలాలు ఉన్నాయి. మసాయిపేట కొత్త మండలం ఏర్పాటుతో ZPTC, MPP పదవులు, ఒక MPTC స్థానం పెరగనున్నాయి. ప్రస్తుతం జడ్పీటీసీ-21, ఎంపీపీ-21, ఎంపీటీసీ-190, గ్రామ పంచాయతీలు 492 ఉన్నాయి. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో‌ గ్రామాల్లో సందడి నెలకొంది.

News February 7, 2025

మెదక్: పెరగనున్న జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవులు

image

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 మున్సిపాలిటీ‌లు, 21 మండలాలున్నాయి. మసాయిపేట కొత్త మండలం ఏర్పడడంతో జడ్పిటిసి, ఎంపిపి పదవులు పెరగనున్నాయి. ఒక ఎంపిటిసి స్థానం పెరగనుంది. ZPTC-21, MPP-21, MPTC-190, గ్రామ పంచాయతీలు 469 ఉండగా 492 కు పెరిగాయి.