India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తూ హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిందని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. www.padmaawards. gov.inలో జూలై 31లోగా ఆసక్తి ఉన్న జిల్లాకు చెందిన వారు డీఐవో ఎన్ఐసీ ద్వారా సంబంధిత హెచ్ఐ్వడీలకు నామినేషన్లను సమర్పించాలని సూచించారు.
మెదక్ జిల్లాలో పోలీసుల పేరుతో పట్టపగలే దారి దోపిడీ జరిగింది. నంగనూరు మండలం పాలమాకులకు చెందిన చిత్తారి శర్మ నర్సాపూర్‌లో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. బస్సు దిగి నడిచి వెళ్తుండగా వచ్చిన ఇద్దరు దుండగులు తాము పోలీసులమని చెప్పి అడ్డుకున్నారు. శర్మను ఒకరు పట్టుకోగా మరొకరు మెడలోని బంగారం గొలుసు, ఉంగరం తీసుకొని పారిపోయారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు SI పుష్పరాజ్ తెలిపారు.
కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉభయ రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. వర్షాలు, ఆరోగ్యం, పాడి పంటలు, సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నానని అన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రుణమాఫీ పథకంలో 57,585 మంది రైతులకు రూ. 451 కోట్ల రుణమాఫీ జరగనుందని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. వర్గల్ విద్యాధరి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. లబ్ధి పొందిన రైతులకు రూ. 450 కోట్ల రుణాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం (ఓడిఎఫ్)చీఫ్ జనరల్ మేనేజర్ శివ శంకర ప్రసాద్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ.. అధికారులు, ఉద్యోగుల సహకారంతో ఆయుధ కర్మాగారం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నుతున్నారని MLA హరీశ్ రావు విమర్శించారు. రాహుల్ గాంధీని అశోక్‌నగర్‌కు పిలిపించి మరీ హామీ ఇప్పించారని, 2లక్షల ఉద్యోగాలు నింపుతామని రాహుల్ మాట ఇచ్చారని గుర్తుచేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు APలో 1:100 పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు.
చేగుంట రోడ్డు ప్రమాదంలో <<13531104>>మృతుల సంఖ్య ఆరు<<>>కు చేరింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల మృతి తీరని విషాదం నింపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చిక్యా రాజేశ్, రాజు, మహేశ్ సోదరులు మేకల వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో రాజు స్పాట్‌లోనే చనిపోగా.. నిన్న రాజేశ్ చనిపోయాడు. మహేశ్ చికిత్స పొందుతున్నాడు. స్వస్థలం నుంచి వచ్చిన వారి బంధువులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.
కుటుంబ కలహాలతో వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన గుమ్మడిదల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. కొత్తపల్లికి చెందిన పోచయ్యకు నర్సాపూర్ మండలం నారాయణపూర్‌కు చెందిన మౌనిక(26)తో 8ఏళ్ల క్రితం పెళ్లైంది. శనివారం ఉదయం దంపతులు గొడవ పడ్డారు. అనంతరం భర్త పనికి వెళ్లగా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను బయటకు పంపి మౌనిక తలుపులు వేసుకుంది. పిల్లల ఏడ్పులతో స్థానికులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఉరేసుకుంది.
RRRకు జాతీయ హోదా, ఒకేసారి నిర్మించాలన్న నిర్ణయంతో పనులు వేగం కానున్నాయి. దీని ఉత్తర భాగం ఉమ్మడి మెదక్ జిల్లాలో 110KM మేర నిర్మాణం కానుంది. ఇది జగదేవపూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి వయా కంది వరకు నిర్మించనున్నారు. గజ్వేల్, తూప్రాన్, సంగారెడ్డి వద్ద హైవేలతో కలవనుంది. RRR కోసం భూములు కోల్పోయిన బాధితులు మళ్లీ నిర్వాసితులు కానున్నారు. దీంతో అలైన్‌మెంటు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
మెదక్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డా.బాలస్వామి తెలిపారు. శనివారం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహణ గురించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న పిల్లల్ని ఎవరైనా వెట్టిచాకిరి గురిచేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.
Sorry, no posts matched your criteria.