India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి ఆధ్యాపకులకు నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ భవాని తెలిపారు. డిగ్రీ కళాశాలలో కామర్స్-2, తెలుగు-1, కంప్యూటర్ సైన్స్-1 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం పైగా మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని వివరించారు. జూలై 1 లోపు కళాశాలలో దరఖాస్తులు అందించాలని సూచించారు.
కేసుల్లో శిక్షల శాతం (కన్వెక్షన్ రేట్) పెంచాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. కోర్టు డ్యూటీ విధులు నిర్వహించే కానిస్టేబుళ్లతో సమీక్ష నిర్వహించారు. కేసుల్లో నిందితులకు శిక్షలు పడేటట్టు కోర్టు కానిస్టేబుల్ కీలక పాత్ర వహించాలని, నాన్ బేలబుల్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే కేసుల్లో నిందితులకు శిక్షలు పడాలన్నారు. క్రమశిక్షణతో పారదర్శకంగా విధులు నిర్వహించారు.
సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ మెదక్ సబ్ జైలునుతనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వంటశాల తనిఖీ చేసి ఆహార నాణ్యతపై జైలు పర్యవేక్షణ అధికారితో చర్చించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ముద్దాయిలకు వివిధ అంశాలపై లీగల్ ఏయిడ్ అపాయింట్మెంట్, జైల్ అదాలత్, ప్లీ బార్గెయినింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు. జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జైలు సిబ్బంది ఉన్నారు.
తూప్రాన్ పట్టణ శివారుల పోతరాజుపల్లిలోని మహాత్మజ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం (వెల్దుర్తి)లో విద్యార్థి మల్లీశ్వరి (12) ఆత్మహత్యాయత్నం చేసింది. ఝరాసంఘం మండలం గిన్నాయపల్లికి చెందిన మల్లీశ్వరి ఈ ఏడాది ఏడో తరగతిలో చేరింది. సోమవారం విచ్చేసిన మల్లీశ్వరి ఇంటికి వెళ్తానంటూ మారాం చేసింది. అనంతరం విద్యాలయంలో దురద మందు తాగగా.. ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లుగా మారి పాఠశాల శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీ సిబ్బంది పాఠశాలలను శుభ్రం చేయాలని ఆదేశాలున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థులు స్వీపర్లుగా పనిచేస్తున్నారు. బాల కార్మికులతో పనులు చేయించవద్దని ఆదేశాలు ఉన్నా.. ఫలితంగా విద్యార్థులే శుభ్రం చేస్తున్నారు
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులో 44వ జాతీయ రహదారి బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 250 మేకలు మృతి చెందాయి. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మధ్యప్రదేశ్ వాసులు మృతి చెందగా.. లారీలో ఉన్న 460 మేకల్లో సుమారు 250 మేకలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మేకల మండికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. SHARE IT
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ, యూఆర్ఎస్, ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన నిధులపైన జూలై 20 నుంచి 22 వరకు ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడిట్లకు సంబంధించిన అన్ని రకాల యూసీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మహిళా సాధికారత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక క్రమశిక్షణలో ముందుంటారని చెప్పారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డిఓ జ్యోతి పాల్గొన్నారు.
జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పెండింగ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. బడి మానేసిన పుల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.