India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి నుండి చౌటుప్పల్ ప్రజలకు తొందర్లోనే ట్రాఫిక్ అలాగే ప్రమాదాల నుంచి ఉపశమనం కలగనుంది. 375 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మాణానికి వచ్చేనెలలో శంకుస్థాపన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా హైవేకి ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డు ని చదును చేసి ఫ్లైఓవర్ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
భూముల విలువలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2022లో పెంచిన భూముల రేట్లను మళ్లీ ఇప్పుడు ఆగస్టు 1 నుంచి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు, ప్రభుత్వం మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జిల్లాలో పొటెన్షియల్ ఏరియాను బట్టి ఏ మేరకు భూముల విలువ పెంచవచ్చనే దానిపై భూముల విలువకు సంబంధించిన కమిటీ నిర్ణయాలు తీసుకోనుంది.
ఉమ్మడి జిల్లాలో డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. డిగ్రీ సంప్రదాయ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు . ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఈ కాలేజీలు నేడు వెలవెలబోతున్నాయి. MG యూనివర్సిటీ పరిధిలో 62 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో 24 వేల సీట్లు ఉన్నాయి. 2 విడతల్లో దోస్త్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ నిర్వహించినా 16 శాతం కూడా అడ్మిషన్లు దాటలేదు.
వానాకాలం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా బ్యాంకర్లు , అధికారులు ప్రత్యేక ఆర్థిక సంవత్సరంలో వానాకాలం , యాసంగి సీజన్లకు కలిసి పలు రంగాలకు ఇవ్వాల్సిన ఆర్థిక రుణ ప్రణాళిక ఇంకా చేయలేదు. దీంతో సాగు పనులకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం అన్నదాతలు ప్రైవేట్ అప్పులకు షావుకారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైతులు రుణ ప్రణాళిక విడుదల చేయాలని కోరుకుంటున్నారు.
ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దామరచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. కొత్తగూడెంకు చెందిన దొడ్డా సురేశ్ యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ పాల్వంచకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
మోటకొండూరు మండలం అమ్మనబోలుకు చెందిన సంధ్య టీజీ పీఈసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించి ప్రతిభకు పేదరకం అడ్డుకాదని నిరూపించింది. గురువారం విడుదలైన ఫలితాల్లో ఆమె మొదటి స్థానం సాధించింది. భవిష్యత్‌లో పోలీస్ ఉద్యోగం సాధిస్తానని ఆమె చెబుతోంది. ఆమెను తల్లిదండ్రులు, గ్రామస్థులు, వ్యాయామ ఉపాధ్యాయుులు అభినందించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 27న లెక్కించనున్నట్లు గురువారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం హాల్ 2లో ఉదయం 7 గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లతో.. భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమీషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్లు అయిన జిల్లా కలెక్టర్లు తగుచర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ నెల 30తో ముగిస్తుండగా , గడువు తేదీని SEP 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.
ఈనెల 21న నిర్వహించాల్సిన నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 22న ఉదయం 10.30 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో ప్రేమ్‌కరణ్ రెడ్డి తెలిపారు. 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున జడ్పీ ఛైర్‌పర్సన్ ఆమోదం మేరకు 22న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు ఐటీఐల స్థానంలో ఏటీసీ(అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్) లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ ఏటీసీలో ఆరు కోర్సులు ఉండనున్నాయి. ఏటీసీగా మార్చేందుకు ఒక్కోదానికి రూ.34 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4వేల మందికి లబ్ధి చేకూరనుండగా ఈ కోర్సుల ద్వారా విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
Sorry, no posts matched your criteria.