Nalgonda

News June 20, 2024

గంజాయి దందాకు అడ్డాగా మిర్యాలగూడ

image

మిర్యాలగూడ గంజాయి దందాకు అడ్డాగా మారింది. టెన్త్, ఇంటర్ చదువుతున్న యువకులు పార్టీల పేరుతో కలుసుకుంటూ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వ్యాపారులు 17 నుంచి 25 ఏళ్ల యువకులే టార్గెట్‌గా చేసుకుని దందా చేస్తున్నారు. మొదట అలవాటు చేసి తర్వాత పెడ్లర్లుగా మారుస్తున్నారు. యువత మత్తుకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని డీఎస్పీ రాజశేఖర రాజు చెప్పారు.

News June 20, 2024

అడుగంటుతున్న జలాశయాలు.. ఆందోళనలో అన్నదాతలు

image

సాగర్ జలాశయం పరిధిలో ఆయకట్టు
ప్రాంత రైతుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతేడాదీ జలాశయానికి ఆశించిన రీతిలో నీరు రాకపోవడంతో సాగర్ కుడి, ఎడమ కాలువ పరిధిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రుతుపవనాలు సరైన సమయానికి వస్తాయని అధికారులు చెబుతున్నా.. వర్షాలు ముఖం చాటేస్తుండడంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 590 అడుగులకు 504.90 అడుగుల నీరు నిల్వ ఉంది. 

News June 20, 2024

నల్గొండ: భూముల విలువ పెరగనుంది..

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూముల విలువ పెరగనుంది. జిల్లాలో ఎక్కడ ఎంత ధర ఉండాలన్న దానిపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. అధికారులు వారంరోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం అత్యధికంగా బేబ్రాజ్ మాచారంలో ఎకరం రూ.1.65 కోట్లు ఉండగా, అత్యల్పంగ తుంగతుర్తిలోని అన్నారంలో ఎకరం రూ.3.30 లక్షలుగా ఉంది. ఇతర ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో మాత్రం ధర విపరీతంగా ఉంది.

News June 20, 2024

రుణమాఫీపై 5,36,726 లక్షల మంది రైతుల ఆశలు

image

రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు పంట రుణాలలు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. AUG 15 నాటికి అర్హులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో 5,36,726 లక్షల మంది రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రుణమాఫీని ఒకేసారి చేస్తారా..? విడతల వారీగా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

News June 19, 2024

సికిల్ సెల్ అనీమియా.. సైలెంట్ కిల్లర్: డిఎంహెచ్వో

image

సికిల్ సెల్ అనీమియా అనేది సైలెంట్ కిల్లర్‌గా ఉంటుందని.. దీనిని గుర్తించి చికిత్స తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. NLG కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ప్రపంచ సికిల్ సెల్ రోజును పురస్కరించుకొని సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News June 19, 2024

యాదాద్రిలో సందడి చేసిన అనసూయ

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ నటి, టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చక పండితులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ఆమెతో సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు.

News June 19, 2024

NLG: సెల్ ఫోన్ రిపేర్, సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ

image

నల్గొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 10వ తరగతి పాసైన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ పురుషులకు సెల్ ఫోన్ రిపేర్, సర్వీసింగ్‌లో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకుడు రఘుపతి బుధవారం తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందని, ఉమ్మడి నల్గొండకి చెందిన 19 సం. నుంచి 45 లోపు వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు జూన్ 24 లోపు సంస్థ ఆఫీసులో లేదా 9701009265 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News June 19, 2024

రక్తదానం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

image

ఏఐసీసీ అగ్ర నేత, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రక్తదానం చేశారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు నాయకులతో కలిసి రక్తదానంలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని, దేశంలో ద్వేషానికి చోటు లేదని చాటి చెప్పిన గొప్ప నాయకుడని మంత్రి అన్నారు.

News June 19, 2024

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన పంచాయతీ కార్యదర్శులు

image

తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ అధ్యక్షడు మధు ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా TPSF జిల్లా గోడ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శుల సమస్యల గురించి మంత్రికి వివరించారు. TPSF జిల్లా గౌరవ అధ్యక్షుడు ఉపేందర్, ట్రెజరర్ నరేష్, దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు జైహిందర్ పాల్గొన్నారు

News June 19, 2024

NLG: తండ్రి చావును తట్టుకోలేక కొడుకు మృతి

image

తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొడుకు మృతి చెందిన ఘటన శాలిగౌరారం మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మనిమద్దె గ్రామానికి చెందిన శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం అంత్యక్రియలు ముగిశాయి. అతని చిన్న కుమారుడు రాంబాబు గుండెపోటుతో కిందపడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.