Nalgonda

News June 19, 2024

NLG: 5.36 లక్షల మంది రైతులకే రుణమాఫీ?

image

రైతు రుణమాఫీకి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంత మంది రైతులకు బ్యాంకుల్లో రుణాలున్నాయి? అందులో ఎంత మంది రూ. లక్షలోపు రుణం తీసుకున్నారు? రూ. లక్ష కంటే ఎక్కువ రుణాలు ఎంత మంది రైతులుకున్నాయనే సమాచారాన్ని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్ల ద్వారా సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

News June 19, 2024

ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్

image

ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ప్రజాదర్బార్, జిల్లాల్లో ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా సోమవారం నుంచి (ఈనెల 24) మండలాల్లో ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందుకు జిల్లా స్థాయి అధికారులను మండలానికి ఒకరిని ప్రత్యేక అధికారులుగా వేస్తున్నట్లు తెలిపారు.

News June 19, 2024

వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రాలుగా రైతు వేదికల మార్పు

image

రైతులకు సాగులో మెళకువలు, శిక్షణలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్‌ సెంటర్లుగా మారుస్తోంది. నల్గొండ జిల్లాలోని ఆరు రైతు వేదికల్లో ఎల్‌సీడీ, వీడియో కెమెరాలు, సౌండ్‌ సిస్టమ్‌ తదితర సౌకర్యాలు కల్పించి వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రాలుగా మార్చింది. వాటితో పాటు ఇప్పుడు మరో 25 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రాలుగా మార్చాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

News June 19, 2024

ఎంజీయూ డిగ్రీ విద్యా ప్రణాళిక విడుదల

image

ఎంజీ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 3, 5 సెమిస్టర్ల విద్యా ప్రణాళికను యూనివర్సిటీ అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ కొప్పుల అంజిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. జూన్ 18 నుంచి తరగతులు ప్రారంభించి నవంబర్ 1 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నల్ పరీక్షలు, సంక్రాంతి సెలవులు, ప్రిపరేషన్ హాలిడేస్ వివరాలను తెలుపుతూ సర్క్యులర్ జారీ చేశారు.

News June 19, 2024

నల్గొండ: పెట్రోల్ బంకుల్లో మోసాలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొన్ని బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ తక్కువగా వస్తోందని, అందులోనూ కల్తీ జరుగుతోందని వినియోగదారులు తరచూ ఆందోళనకు దిగుతున్నా అధికారుల పర్యవేక్షణ కరువైంది. గన్ తీయగా పెట్రోల్ కొట్టకముందే రూ.5.70 చూపిస్తోందని సూర్యాపేటలో ఓ వినియోగదారుడు తెలిపాడు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ మోహన్ బాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 500పైనే బంకులున్నాయి.

News June 19, 2024

NLG: గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్

image

నల్లగొండ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన TGPSC గ్రూప్ – II కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను వెబ్ సైట్: https://tgbcstudycircle.cgg.gov.in లో బుధవారం నుండి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 19, 2024

సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ కు ఉచిత శిక్షణకు దరఖాస్తు

image

2024-25 సంవత్సరానికై షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ హైద్రాబాద్ లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ (పదినెలలు)ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందిని రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన వారు ఆన్ లైన్ ద్వారా జూలై 10వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 18, 2024

NLG: రేపటి వరకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

image

పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార భద్రత కార్డుదారులకు జూన్ నెలకి సంబంధించి ఉచిత బియ్యాన్ని ఈనెల 19 వరకు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు ఈనెల 19 వరకు తీసి ఉంచాలని.. ప్రతి కార్డుదారునికి బియ్యం పంపిణీ చేయాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News June 18, 2024

నల్గొండ: పోలీస్ స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో ఎర్రబెల్లికి చెందిన వెంకయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. భూవివాదంలో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని మనస్థాపం చెంది మంగళవారం వెంకయ్య పురుగుల మందు తాగినట్లు తెలుస్తుంది. వెంకయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News June 18, 2024

అడుగంటిన నాగార్జున సాగర్ 

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. మంగళవారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.50 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు 122.5225 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఇక నందికొండ ప్రజలకు తాగు నీటికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతోంది.