Nalgonda

News May 18, 2024

నల్గొండ: ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక సూసైడ్

image

బాలిక ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల, ఎస్ఐ కథనం ప్రకారం.. మిర్యాలగూడ మండలానికి చెందిన బాలిక(17) పారామెడికల్ కోర్స్ చదువుతోంది. తక్కెళ్ళపాడుకి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా నిందితుడు ప్రేమ పేరుతో వేధించడంతో పాటు, ఫోన్ తీసుకొని దాడి చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకున్నట్లు తెలిపారు.

News May 18, 2024

NLG: లైంగికదాడి కేసులో బాలుడికి జైలు శిక్ష

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో బాలుడికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జడ్జి శిరీష శుక్రవారం తీర్పు వెలువరించారు. నల్గొండ మండలం ఆర్జాలబావికి చెందిన బాలుడు 2020 జూలై 19న అదే కాలనీకి చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News May 18, 2024

నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న వైరస్

image

క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. బాధితులు నయమయ్యే వరకు ఔషధాలు వాడకుండా మధ్యలోనే ఆపేయడం, వ్యాధిపై అవగాహన లేకపోవడంతో తిరిగి వ్యాధి తిరగపెడుతోంది. క్షయ ఒకరి నుంచి మరొకరికి సోకే అంటు వ్యాధి కావడంతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా వ్యాధి వ్యాప్తి జరుగుతోంది. జిల్లాలో మూడు నెలల్లో 282 కేసులు నమోదు అయ్యాయి.

News May 18, 2024

గుర్రంపోడు: ‘డీఎస్పీ అభ్యర్థి దుర్గాప్రసాద్‌ని పట్టభద్రులు గెలిపించాలి’

image

వరంగల్, ఖమ్మం, NLG పట్టభద్రుల MLC ఉప ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మామిడి సైదయ్య (జగన్) పట్టభద్రుల ఓటర్లను కోరారు. శుక్రవారం మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు ఒకవైపు, రాజ్యాంగాన్ని తీసివేయాలనే వాళ్ళు ఒకవైపు ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరారు.

News May 17, 2024

NLG : మల్లన్నను తప్పించాలని కాంగ్రెస్ బహిష్కృత నేత ధర్నా

image

శ్మశానానికి పంపుతారా-శాసన మండలికి పంపుతారా అని 4.61 లక్షల గ్రాడ్యుయేట్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిన తీన్మార్ మల్లన్నను ఎన్నికల బరి నుంచి తొలగించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేశారు.

News May 17, 2024

ఇంటర్‌ ఫస్టియర్‌ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌ టేబుల్‌

image

మే 24న సెకండ్‌ లాంగ్వేజ్‌, 25న ఇంగ్లిష్‌ పేపర్‌, 28న మ్యాథ్స్‌-1ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌-1 పరీక్షలు, 29న మ్యాథ్స్‌-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1 పరీక్షలు, 30న ఫిజిక్స్‌-1, ఎకనామిక్స్‌-1 పరీక్షలు, 31న కెమిస్ట్రీ-1, కామర్స్‌-1 పరీక్షలు, జూన్‌ 1న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-1, బ్రిడ్జికోర్స్‌ మ్యాథ్స్‌-1 పరీక్షలు, జూన్‌ 3న మోడరన్‌ లాంగ్వేజీ-1, జాగ్రఫీ -1 పరీక్షలు జరగనున్నాయి.

News May 17, 2024

ఎర్రవరంలో ఉత్సవాలు

image

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరంలో ఈ నెల 21 నుంచి 23 వరకు శ్రీ దూళ్లగుట్ట బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దంపతులు హాజరకానున్నారని దేవాలయ కమిటీ తెలిపింది. భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు.

News May 17, 2024

సూర్యాపేట: రూ.2 లక్షలు ఇచ్చాక తల్లికి తలకొరివి

image

నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంలో ఆస్తి వివాదం విషయంలో <<13263429>>అంత్యక్రియలు ఆగిన<<>> విషయం తెలిసిందే. తల్లి అంత్యక్రియల ఖర్చును తాను భరించలేనని, డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని కొడుకు అన్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రెండు లక్షలు ఇప్పియడంతో ఆ పంచాయితీ కొలిక్కి వచ్చింది. తర్వాత ఆమె అంత్యక్రియల‌ను నిర్వ‌హించారు.

News May 17, 2024

సూర్యాపేట: ఆస్తి తగాదాలతో ఆగిన తల్లి అంత్యక్రియలు

image

మానవత్వం మంట కలిసిపోతోందనటానికి ఈ ఘటనే నిదర్శనం. తల్లి మృతిచెంది రెండు రోజులవుతున్నా డబ్బు కోసం అంత్యక్రియలు నిర్వహించని అమానవీయ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. నేరేడుచర్ల మండలం కందుల వారి గూడెంలో లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో మరణించింది. తన పేరిట ఉన్న ఆస్తులు పంపకంలో కుమారుడు, కూతురు మధ్య వివాదం తలెత్తింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించలేదు.

News May 17, 2024

 38.55 లక్షల మొక్కలు నాటనున్నారు

image

నల్గొండ జిల్లాలో 2024 సంవత్సరంలో హరిత లక్ష్యం ఖరారైంది. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 38.55 లక్షల మొక్కలు నాటనున్నారు. గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్యం నిర్ణయించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 844 పల్లె నర్సరీలలో మొక్కలు పెంచే పనులను ప్రారంభించారు. గత 9 ఏళ్లలో గత ప్రభుత్వం 10 కోట్ల మొక్కలను నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాటారు.