India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను వాడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయి, రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో తుమ్మలపల్లి గ్రామస్థులు దర్నా చేపట్టారు. ఇసుక ట్రాక్టర్ ఢీకొని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఖమ్మం- సూర్యాపేట హైవేపై బైటాయించి ఆందోళన చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ధనవంతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం వేసిన నకిలీ నక్సల్స్ ముఠాను గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద మూడు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం తన కార్యాలయంలో దేవరకొండ డీఎస్పీ గిరిబాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా మోతె మండలంలో రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. SI యాదవేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్(32) మామిళ్లగూడెం నుంచి తుమ్మలపల్లికి వెళ్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో ఉపేందర్ తల ట్రాక్టర్ ఇంజిన్‌కు తగిలి ఛిద్రమైంది. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కేసు నమోదైంది
కోదాడ నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్టాండులో గంటల తరబడి వేచి ఉన్న ప్రయాణికులు బస్సులు రాకపోవడంతో విసుగు చెంది వేరే బస్సులు బస్టాండ్‌లోకి రాకుండా ఆందోళన చేశారు. బస్సుల సంఖ్య ఎందుకు పెంచడం లేదంటూ అధికారులను నిలదీశారు. అవసరమైతే మీకు డబ్బులు చెల్లిస్తాం.. బస్సులు పంపించండి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్టీసీ డీఎంకు ఫోన్ చేయగా 10 నిమిషాల్లో బస్సు వేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు.
పోచంపల్లి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ PSSR లక్ష్మి తెలిపారు. సంస్థలో 6 నెలల కాల పరిమితితో కూడిన ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టం ఇన్స్టాలేషన్ సర్వీస్, కంప్యూటర్ హార్డ్వేర్ , సెల్ ఫోన్ తదితర కోర్సులు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామం పరిధిలోని వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి మండవ నాగేశ్వరరావు( 40) అక్కడికక్కడే మృతి చెందారు. గరిడేపల్లి మండలం తాల్ల మల్కాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు నేరేడుచర్ల మండలం ముకుందపురం సబ్ స్టేషన్‌లో విద్యుత్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తూ నేరేడుచర్ల పట్టణంలో నివసిస్తున్నారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై రాంబాబు వివరాల ప్రకారం.. పట్టణంలోని బంగారు గడ్డకు చెందిన మారేండ్ల సైదులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్లు ఈనెల 17 వరకు కార్డు దారులకు బియ్యాన్ని పంపిణీ చేయాలని దేవరకొండ పౌరసరఫరాల శాఖ అధికారి హనుమంతు శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో సూచించారు. ప్రతినెల 15 వరకు బియ్యం పంపిణీ చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలిపారు. రేషన్ షాపులను సకాలంలో తెరిచి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు.
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల బరిలో 27 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. జనరల్ స్థానoలో 11 మంది, మహిళ కేటగిరిలో ముగ్గురు , ఎస్సీ కేటగిరిలో ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా రెండు మహిళల స్థానానికి ముగ్గురు అభ్యర్థులు , ఒక ఎస్సీ స్థానానికి ఇద్దరు , ఆరు జనరల్ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.
Sorry, no posts matched your criteria.