Nalgonda

News May 16, 2024

నల్గొండ: 10 రోజుల పాటు థియేటర్లు బంద్

image

రేపటి నుంచి పది రోజుల పాటు సినిమాల ప్రదర్శనలకు విరామం ఇవ్వాలని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ప్రతినిధులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 40కి పైగా థియేటర్లు ఉన్నాయి. నిర్వహణ వ్యయం పెరిగిందని థియేటర్ల అద్దె పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

News May 16, 2024

నల్గొండలో భారీ మెజార్టీ: ఈటల

image

నల్గొండ ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈటల రాజేందర్ కీలక వాఖ్యల చేశారు. నల్గొండ స్థానంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. పట్టభద్రులు కూడా మోదీ వైపే చూస్తున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ను గెలిపించాలని ఈటల కోరారు.

News May 16, 2024

NLG: రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు 

image

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 17వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్.. 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 16, 2024

యాదాద్రి: భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం

image

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మహిపాల్ రెడ్డి(39) మృతిచెందగా, భార్య నవిత తీవ్రంగా గాయపడింది. బైక్‌పై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనాన్ని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లగా మంటలు చెలరేగి ద్విచక్రవాహనం కాలిపోయింది. దీంతో మహిపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News May 16, 2024

నల్గొండ: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కంకణాలపల్లికి చెందిన సతీశ్ చారి రైలు కింద పడి చనిపోయిన ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కేశరాజు పల్లి గ్రామ సమీపంలో రైల్ ట్రాక్ కింద పడి మృతి చెందారు. మృతుడికి భార్య, ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. సతీశ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 16, 2024

NLG: అసంపూర్తిగా డిజిటల్ సర్వే.. 

image

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ డోర్ నంబర్ల సర్వే అర్ధాంతరంగా నిలిచిపోయింది. పూర్తి వివరాలు అందజేయకుండా సంబంధిత కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నారు. సర్వే ప్రారంభమై ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. క్షేత్ర స్థాయిలో దాదాపు 80 శాతం సర్వే పూర్తయినట్లు సర్వే సంస్థ చెబుతున్నా అంతా అసంపూర్తిగానే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

News May 16, 2024

వానాకాలం సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం

image

వానాకాలం సాగుకు జిల్లా వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది. సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. గతంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరతను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తుగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు.

News May 16, 2024

భువనగిరి: స్వల్పంగా పెరిగిన పోలింగ్.. గెలుపు ఎవరిది…?

image

భువనగిరి MP సెగ్మెంట్ పరిధిలో 2019తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో 75.11శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 76.78 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(INC) 5,119 స్వల్ప మెజార్టీతో బూర నర్సయ్య(BRS)పై గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ తరఫున చామల, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్ , బీజేపీ నుంచి బూర నర్సయ్య బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 16, 2024

పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది: జిల్లా కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నల్గొండ పార్లమెంటు స్థానంలో 74.03 శాతం పోలింగ్ నమోదు అయిందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరో 2 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.

News May 15, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ బరిలో 52 మంది

image

WGL-KMM-NLG పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కలెక్టర్ హరి చందన తెలిపారు. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ పరిధి 12 జిల్లాలలో ఉందని, 12 మంది అదనపు కలెక్టర్లు ఏఆర్ఓలుగా ఉన్నారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టుకోవచ్చని, దానికి సంబంధించిన అనుమతులు జిల్లా స్థాయి ఏఆర్వోల వద్ద అనుమతి తీసుకోవాలని అన్నారు.