India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని 83 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అయ్యాయి. పదోన్నతులు ఉత్తర్వులు పొందిన 83 మందిలో 82 మంది గురువారం విధుల్లో చేరారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు విధుల్లో చేరలేదు. జిల్లాలోని 75 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి లభించగా ఇందులో 53 మంది ఎస్ఏలకు జిల్లా పరిధిలోనే పోస్టింగులు దక్కాయి.
హైదరాబాద్ – విజయవాడ హైవేపై దారి దోపిడీలు, హత్యలు, దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. రెండు నెలల కాలంలో పలు దోపిడీలు, దొంగతనాలు జరగడంతో రాత్రిపూట ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. చౌటుప్పల్లో గతంలో ఇలాంటి ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. తాజాగా ఏపీ లింగోటం వద్ద లారీని ఆపి డ్రైవర్ ను తాళ్లతో కట్టి నగదు చోరీ చేశారు. గత నెల 18న ఎరసానిగూడెం వద్ద లారీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన ప్రియురాలి కుమార్తెను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 11న నల్గొండ జిల్లా ఐలాపురంలో 22 నెలల చిన్నారిని హత్య చేసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నవ్య శ్రీ తన ఇద్దరి కుమార్తెలతో కలిసి అరవింద్ రెడ్డితో ఐలాపురంలో నివాసం ఉంటోంది.
గొర్రెల యూనిట్ల కోసం డీడీలు చెల్లించిన లబ్దిదారులు డీడీల వాపస్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వెంటనే డబ్బులు బ్యాంకు ద్వారా వారి ఖాతాల్లో జమ చేయిస్తామని తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ అనుమతితో 800 మంది లబ్ధిదారులకు డీడీ డబ్బులు జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు.
పుట్టుకతోనే పోలియో సోకినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పారా వాలీబాల్ నేషనల్ టీంలో చోటు సాధించాడు రాగుల నరేష్ యాదవ్. ఆయన మేళ్లచెరువు మం. కందిబండ వాసి. 2014, 2015లో 5వ జాతీయ స్థాయి క్రీడల్లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2015, 16, 17లో బెస్ట్ స్పోర్ట్స్ మెన్ అవార్డులను గెలుచుకున్నాడు. తాజాగా చైనాలో జరిగిన క్రీడల్లో టీం రెండో స్థానంలో నిలపడంలో కీలకమయ్యాడు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న ఎడమకాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు మహర్దశ పట్టనుంది. సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఎడమ కాల్వ పరిధిలోని ఎగువ భూములకు నీరందించేందుకు 1970లో ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. లక్ష ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా పరిధిలో సాగర్ నుంచి నడిగూడెం వరకు పలు దఫాలుగా మొత్తం 54 లిఫ్టులను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నానాటికీ పెరుగుతున్నాయి. దీనికి తోడు యూనిఫాం, షూస్, బెల్టులు, పుస్తకాల ఫీజుల పేరిట ప్రైవేటు స్కూళ్లు నిలువు దోపిడీ చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా మధ్యమధ్యలో ఈవెంట్లు, వేడుకల కోసం చిన్నారులకు ప్రత్యేక దుస్తులకు, క్యాస్టూమ్స్‌కు మరికొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
నల్గొండ జిల్లాలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మరణించగా మరో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన చందనపల్లిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) ఎమ్మెల్సీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్నను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మల్లన్నను ఎంపీ చామల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
భర్త ఉద్యోగం కోల్పోయాడని మానసిక వేదనతో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉబ్బెల్లి ఉమ(27)కు కొండ ప్రదీప్ తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రదీప్ ఉద్యోగం కోల్పోవడంతో మనస్తాపంతో ఉమ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. మృతురాలి తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మీనర్సయ్య గురువారం తెలిపారు.
Sorry, no posts matched your criteria.