Nalgonda

News June 13, 2024

తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం

image

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రమాణం చేయనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరుకానున్నారు.

News June 13, 2024

నల్గొండ: చిన్నారి దారుణ హత్య

image

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. NZB జిల్లా రెంజల్ మండలానికి చెందిన నవ్యశ్రీకి అదే మండలానికి చెందిన లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి అరుణ్య, మహన్వి(22నెలలు) కుమార్తెలున్నారు. 7 నెలల క్రితం అరవిందరెడ్డి అనే వ్యక్తితో నవ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి చిన్నారులతో నల్గొండ జిల్లాకు వచ్చి ఉంటోంది. తన వివాహేతర సంబంధానికి మహన్వి అడ్డువస్తోందని అరవిందరెడ్డి హతమార్చాడు.

News June 13, 2024

యాదాద్రి: ట్రాన్స్ఫార్లు, ప్రమోషన్ల కోసం 2130 మంది అప్లికేషన్లు

image

యాదాద్రి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్​కలిపి 712 స్కూల్స్​ఉన్నాయి. వీటిల్లో 3,465 టీచర్​పోస్టులు ఉండగా 2,800 మంది పనిచేస్తున్నారు. వీరిలో 2,130 మంది ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల కోసం అప్లయ్​ చేసుకున్నారు. వారి సర్వీస్​రిజిస్ట్రర్లను​ ఆఫీసర్లు పరిశీలించి ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లకు సంబంధించి లెక్కలు తేల్చనున్నారు. జిల్లాలో163 మంది గెజిటెడ్​హెడ్మాస్టర్లకు 75 మంది పని చేస్తున్నారు.

News June 13, 2024

అవిశ్వాసం వీగిపోతుంది: డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి

image

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నష్టాల్లో ఉన్న బ్యాంకును తమ పాలకవర్గం, రైతుల సహకారంతో అభివృద్ధి పథంలో నడిపించామని డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని , డైరెక్టర్లు అందరూ తమ వైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. రూ.900 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంకుని రూ.2400 కోట్ల టర్నోవర్‌ కు తెచ్చామని తెలిపారు.

News June 13, 2024

నల్గొండ: వృద్ధురాలిపై లైంగిక దాడి

image

నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలిపై ఆమె బంధువు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆమెకు వరుసకు అల్లుడైన వ్యక్తి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె స్పృహ కోల్పోయినప్పటికీ చిత్రహింసలకు గురిచేయడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై సతీశ్ చెప్పారు.

News June 13, 2024

నల్గొండ: డబ్బులు జమ కావట్లే!

image

మహాలక్ష్మి పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ బండ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది లబ్ధిదారుల ఖాతాలో రాయితీ డబ్బులు జమ కావడం లేదు. దీంతో ఏజేన్సీలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది DEC 26 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లాలో 10.07 లక్షల రేషన్ కార్డులుండగా 10.17 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.

News June 12, 2024

బడి ఈడు ఉన్న ప్రతి పిల్లవాడు బడిలోనే ఉండాలి: జిల్లా కలెక్టర్

image

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ దాసరి చందన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి ఈడు ఉన్న ప్రతి పిల్లవాడు, అమ్మాయి బడిలో ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, వారికీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.

News June 12, 2024

విద్యుత్ షాక్ తో కార్మికుడు మృతి

image

SRPT:ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి కార్మికుడు మృతి చెందిన ఘటన హుజూర్నగర్‌లో చోటుచేసుకుంది. ఎన్ఎస్పీ కెనాల్‌లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాంసింగ్ బఘెల్ తండ్రి మూక రాం కొలతల కోసం ముత్యాల బ్రాంచ్ కాల్వలో దిగాడు. అక్కడ అల్యూమినియం మెజర్మెంట్స్ పూర్తి చేసుకొని బయటికి వచ్చే క్రమంలో తన వద్ద ఉన్న అల్యూమినియం కరెంట్ తీగలకు తగిలి మృతి చెందాడు.

News June 12, 2024

నామినేటెడ్‌ పదవులు.. NLG మంత్రులు ఎవరివైపు..?

image

ఎంపీ ఎన్నికలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆశావహులు తమ నాయకుల ద్వారా పైరవీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. KDD, HZNR నియోజకవర్గ నేతలు మంత్రి ఉత్తమ్‌ ద్వారా NLG, NKL, DVK నియోజకవర్గాల నేతలు మంత్రి కోమటిరెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాలుగైదు రోజుల్లో పదవుల భర్తీపై స్పష్టత రానుంది.

News June 12, 2024

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

image

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో అధికారలు ప్రవేటు పాఠశాలలకు హెచ్చరికలు జారీచేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా అడ్డగోలుగా ఫీజులను పెంచిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో బిక్షపతి తెలిపారు. అవసరమయితే గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.