India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మిర్యాలగూడలో మంగళవారం దొంగలు హల్‌చల్ చేశారు. పట్టణంలో బైక్ మీద నుంచి కింద పడినట్లు నటిస్తూ.. సాయం చేసేందుకు వచ్చిన వారి సెల్‌ఫోన్లను చోరీ చేశారు. పట్టణ పరిధిలో ఒక్క రోజే ఐదు ఘటనలు వెలుగు చూశాయి. వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాగా ఈ విషయమై ఒకటో పట్టణ సీఐ సుధాకర్‌ను వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్లగొండలో ఇంటర్ విద్యతో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ కోర్సులో చేరేందుకు ఎంట్రెన్స్ పరీక్ష ఫీజును ఈనెల 17 వరకు చెల్లించాలని ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజియూ ప్లేస్మెంట్ డైరెక్టర్ వై.ప్రశాంతి తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు.
కోదాడకి చెందిన విద్యుత్ లైన్ ఇన్స్‌పెక్టర్ దేవరపల్లి సీతారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం వాకింగ్‌కి వెళ్లి వచ్చిన ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. వైద్యశాలకు తరలించే లోపు ఆయన కన్నుమూశారు. కాగా ఆయన భార్య అనురాధ గుడిబండ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సీతారెడ్డి మృతి పట్ల విద్యుత్, విద్యాశాఖ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐ.టి.ఐ.లలో అడ్మిషన్ల కోసం మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఐ.టి.ఐ కన్వీనర్, ప్రిన్సిపల్ ఎం.గోపాల్ రెడ్డి తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు http://iti.telangana.gov.in అనే వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ కసాయి తండ్రికి 25 ఏళ్లు జైలుశిక్షను విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు స్పెషల్ సెషన్స్ మహిళా జడ్జి శ్యామ్‌శ్రీ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా.. గతేడాది ఫిబ్రవరి 23న మద్యం మత్తులో సంపత్ కుమార్ తన కూతురిపై అత్యాచారం చేశాడు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా తీర్పు వెలువడింది.
చౌటుప్పల్ మం. పంతంగిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలిలా.. హన్మంతరెడ్డి HYDలో ఉంటున్నారు. అతడికి సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వీరికి 7.24 ఎకరాల భూమి ఉంది. వివాదం పరిష్కరించుకోవడానికి హన్మంతరెడ్డి గ్రామానికి వచ్చాడు. ఎటూ తేలకపోవడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. వివాదం పరిష్కారమయ్యాకే అంత్యక్రియలు నిర్వహించాలని మృతుడి బంధువులు డిసైడ్ అవడంతో మూడు రోజులుగా మృతదేహం మార్చురీలోనే ఉంది.
కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ త్వరలో ఉంటుందని కేబినెట్ మీటింగ్‌లో విధి విధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ తాజాగా వెల్లడించడంతో ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీ చేపడతామని చెప్పడంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. నూతన కార్డుల కోసం 39,874, కార్డుల్లో మార్పునకు 63,691 దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 10,07,090 కార్డులుండగా, లబ్ధిదారుల సంఖ్య 29,84,569గా ఉంది.
వానకాలం ప్రారంభమైనందున వరదల వలన నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అదనపు కలెక్టర్లను ఆదేశించారు. యాదాద్రి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి చందన జిల్లా అధికారులను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలు, వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు, అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.
మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లికి చెందిన కుంచం శివ తల్లిందండ్రులు లేరనే బాధను దిగమింగి ఐఐటీ జేఈఈలో సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో జనరల్ కేటగిరీలో 211, బీసీ కేటగిరీలో 24లో ర్యాంకు సాధించాడు. ఆరేళ్ల క్రితం శివ తల్లి జ్యోతి అనారోగ్యంతో చనిపోగా, నాలుగేళ్ల క్రితం తండ్రి శ్రీను భూగర్భ డ్రైనేజీలో ఊపిరాకడ మృతిచెందాడు. దీంతో మేనమామ నోముల నాగార్జున దగ్గర ఉండి చదువుల్లో రాణిస్తున్నాడు.
Sorry, no posts matched your criteria.