Nalgonda

News June 10, 2024

నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ పై అవిశ్వాసం

image

ఉమ్మడి నల్గొండ జిల్లా DCCB ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. అవిశ్వాసానికి మద్దతుగా 14 మంది డైరెక్టర్లు సంతకాలు చేసి డీసీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ పరిణామంతో మహేందర్ రెడ్డి డీసీసీబీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

News June 10, 2024

‘రఘువీర్‌కి భారీ మెజార్టీ ఇచ్చి చరిత్ర సృష్టించారు’

image

నల్గొండ ఎంపీ రఘువీర్‌కి 5లక్షల పైచిలుకు మెజార్టీ ఇచ్చి చరిత్ర సృష్టించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మోదీపై అవిశ్వాసాన్ని ప్రతిబింబించిందన్నారు. బీజేపీపై ప్రజలకు విశ్వాసం లేనందునే 63 సీట్లు తగ్గాయని, అదే సమయంలో కాంగ్రెస్ బలం రెట్టింపు అయిందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే తీర్పును ప్రజలిచ్చారని తెలిపారు.

News June 10, 2024

మరుగుదొడ్డి విషయంలో గొడవ.. వివహిత సూసైడ్

image

అత్త, భర్త మందలించారని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మోతె మండలంలో జరిగింది. రాంపురంతండాకు చెందిన నాగు దంపతులు ఉఫాధి కోసం HYDలో ఉంటున్నారు. కాగా ఈ దంపతులు 10రోజులక్రితం తండాకు వచ్చారు. అప్పటి నుంచి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం మొదలు పెట్టారు. కాగా ఈ విషయమై ఉమ ఆమె భర్త, అత్త మధ్య గొడవకు దారి తీసింది. దీంతో మనస్తాపానికి గురైన ఉమ గడ్డిమందు తాగింది. ఆసుపత్రికి తరలించాగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

News June 10, 2024

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరిక

image

కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పనులలో నాణ్యత ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అధికారులు అలక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లోని రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా 85 పనులకు 2 నియోజకవర్గాల్లో కొత్త, రెన్యూవల్‌ కలిపి రూ.124.65 కోట్ల పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు

News June 10, 2024

యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్ వెంకట్రావ్

image

సోమవారం నుంచి సూర్యాపేట జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్, శాసన మండలి ఎన్నికలు ముగియడంతో ఎన్నికల సంఘం కోడ్ ముగిసిందని జిల్లాతో పాటు అన్ని మండలాల్లో తహశీల్దార్ల కార్యాలయాల్లో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా చేపట్టాలని సూచించారు.

News June 9, 2024

ఇండియా -పాక్ మ్యాచ్.. హాజరైన మంత్రి కోమటిరెడ్డి

image

అమెరికాలో జరుగుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను మంత్రి కోమటిరెడ్డి వీక్షిస్తున్నారు. ఆయనతోపాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మ్యాచ్ వీక్షించడానికి వెళ్లారు.

News June 9, 2024

NLG: ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి

image

నారాయణపూర్ మండలం వాయిల్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపై రాళ్లు విసిరారు. రాళ్లు వేయడంతో అద్దాలు ధ్వంసమై బస్సు లోపల పడ్డాయి. బస్సు చౌటుప్పల్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండగా, కొన్ని చోట్ల ఆపకపోవడంతో రాళ్లతో దాడి చేసినట్లుగా ప్రయాణికులు భావిస్తున్నారు. కాగా బస్సును నారాయణపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News June 9, 2024

NLG: నాలుగో ప్రయత్నంలో విజయం…!

image

రెండుసార్లు MLCస్థానానికి, ఓ సారి MLAస్థానానికి పోటీచేసి ఓడిన మల్లన్న.. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. 2015లో NLG- KMM-WGLఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో HZNR అసెంబ్లీ ఉపఎన్నికలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడారు. 2021లో NLG- KMM-WGL ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం అదే స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో మల్లన్న విజయం సాధించారు.

News June 9, 2024

NLG: పక్షం ముందుగానే సాగు పనులు!

image

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ముందుగానే వర్షాలు పడటం, ఈ ఏడాది ఆశాజనకంగానే వర్షాలు ఉంటాయని చెబుతుండటంతో రైతులు పక్షం రోజుల ముందుగానే సాగు పనులు మొదలు పెట్టారు. DVK, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. ఈ సీజన్లో 3 జిల్లాల్లో 21 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి.

News June 9, 2024

NLG: అటు బడిబాట.. ఇటు బదిలీల బాట!

image

ఉమ్మడి జిల్లాలో విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమం ఆరంభమైన మరుసటి రోజే ఉపాధ్యాయుల బదిలీల బాట మొదలైంది. ఓ పక్క ఉపాధ్యాయులకు బడిబాట కార్యక్రమం అప్పగిస్తూనే మరో వైపు వారికి బదిలీకి అవకాశం కల్పించింది. దీంతో ఉపాధ్యాయులు చాలా వరకు బదిలీల కోసం ప్రయత్నాలు ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాళీలు వెతుక్కోవడం, ఆప్షన్లు పెట్టుకోవడం వంటి పనుల్లో బిజీగా ఉంటున్నారు.