Nalgonda

News June 9, 2024

NLG: అటు బడిబాట.. ఇటు బదిలీల బాట!

image

ఉమ్మడి జిల్లాలో విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమం ఆరంభమైన మరుసటి రోజే ఉపాధ్యాయుల బదిలీల బాట మొదలైంది. ఓ పక్క ఉపాధ్యాయులకు బడిబాట కార్యక్రమం అప్పగిస్తూనే మరో వైపు వారికి బదిలీకి అవకాశం కల్పించింది. దీంతో ఉపాధ్యాయులు చాలా వరకు బదిలీల కోసం ప్రయత్నాలు ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. ఖాళీలు వెతుక్కోవడం, ఆప్షన్లు పెట్టుకోవడం వంటి పనుల్లో బిజీగా ఉంటున్నారు.

News June 9, 2024

NLG: పెట్టుబడి సాయం అందక రైతన్న పాట్లు

image

వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు కురుస్తుండడంతో పత్తి విత్తనాలు విత్తుతున్నారు. మృగశిర కార్తె ప్రారంభం కావడంతో వరినార్లు పోసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కనీసం విధివిధానాలను రూపొందించకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. పెట్టుబడి సాయం కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

News June 9, 2024

భార్య వేధింపులతో భర్త సూసైడ్

image

భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులతో భర్త సూసైడ్ చేసుకున్న ఘటన హుజూర్‌నగర్‌లోని సీతారాంనగర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ముత్తయ్య వివరాల ప్రకారం.. చిట్టిప్రోలు రంజిత్‌కుమార్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య స్వప్న రేషన్‌ దుకాణం నడిపిస్తుంది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి గొడవ పడుతున్నారు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు వేధిస్తుండటంతో ఆయన ఉరేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

News June 9, 2024

నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే..

image

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తరువాత 2007లో శాసనమండలి వ్యవస్థను తిరిగి ప్రారంభించారు. WGL–KMM–NLG గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా తొలిసారి టీఆర్‌ఎస్‌ నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లోనూ కపిలవాయి విజయం సాధించారు. 2015 తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. మళ్లీ 2021ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.

News June 9, 2024

నల్గొండ: గ్రూప్‌-1 అభ్యర్థులకు ఆర్ఎం కీలక సూచన

image

రేపు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజినల్ మేనేజర్ S.శ్రీదేవి తెలిపారు. ఉమ్మడి నల్గొండ పరిధిలో 88 సెంటర్లలో పరీక్షకు హాజరయ్యే సుమారు 29,973 అభ్యర్థులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశామని, RTC బస్సుల్లో ప్రయాణించి క్షేమంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.

News June 9, 2024

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట భద్రత: జిల్లా ఎస్పీ చందన దీప్తి

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు భద్రత పరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 47 సెంటర్లలో మొత్తం 16,899 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారని, పరీక్షకు వచ్చే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుదని పేర్కొన్నారు.

News June 8, 2024

సోనియా గాంధీని కలిసిన నల్గొండ, భువనగరి ఎంపీలు

image

ఎంపీగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డితో సోనియా గాంధీని కలిశారు. ఈ కార్యక్రమంలో మిగతా ఎంపీలు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

News June 8, 2024

యాదాద్రి ఆలయంలో వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు వృద్ధులు, వికలాంగులు
అనారోగ్యంతో నడవలేని స్థితిలో బ్యాటరీ వెహికిల్ తో పాటుగా దేవస్థానం ప్రోటోకాల్ కార్యాలయం ముందు వీల్ చైర్లు అందుబాటులో ఉన్నాయని ఆలయా ఈవో భాస్కర్ రావు
తెలిపారు. ఈ బ్యాటరీ వెహికల్ అవసరమైన భక్తులు తమ పేరును, సెల్ నెంబర్ నమోదు చేసుకొని ప్రోటోకాల్ కార్యాలయంలో గల ఈ వీల్ చైర్ లను భక్తులు ఉపయోగించు కోవాలన్నారు.

News June 8, 2024

ఎంజీయూలో 5 ఏళ్ల ఫార్మా కోర్సు

image

ఇంటర్ విద్యతో MGUలో 5సం.రాల ఇంటిగ్రేటెడ్ ఫార్మాసుటికల్ కెమిస్ట్రీ పీజీ కోర్స్ చేయవచ్చని అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంజీయూ ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి తెలిపారు. కోర్సు పూర్తి అయిన విద్యార్థులకు నేరుగా ఫార్మా ఇండస్ట్రీలో అవకాశాలు, ప్రాజెక్టు వర్క్ కోసం ఇండస్ట్రీ, ఐఐసీటీ, ఐఐటీని ఎంచుకోవచ్చన్నారు. ఈ కోర్సును OU నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అర్హత సాధించి ఎంచుకోవచ్చన్నారు.

News June 8, 2024

గ్రూప్-1 ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

రేపు గ్రూప్-1 పరీక్ష జరుగుతున్న దృష్ట్యా యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే భువనగిరిలోని జాగృతి, మదర్ థెరిసా కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.