Nalgonda

News June 8, 2024

ఆటా మహాసభల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

image

అమెరికాలోని అట్లాంటా నగరంలో జరుగుతున్న 18వ ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వారి వెంట తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రవాస భారతీయులు తదితరులున్నారు.

News June 8, 2024

కోకా కోల డైరెక్టర్‌తో మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు భేటీ

image

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు శనివారం అట్లాంటాలోని కోకా కోలా హెడ్ క్వార్టర్స్‌లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనాథన్ రీఫ్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోకా-కోలా మేనేజ్ మెంట్‌ను ఆహ్వానించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు.

News June 8, 2024

నల్గొండ: కాంగ్రెస్ ఫస్ట్ టైం విన్

image

NLG-WGL-KMM పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపుతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ఈ స్థానాన్ని ఫస్ట్ టైం గెలుచుకున్నట్లైంది. 2015, 21లో ఈస్థానాన్ని బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) గెలుచుకుంది. ఈ సారి మాత్రం పట్టభద్రులు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు.

News June 8, 2024

తీన్మార్ మల్లన్న విజయం.. రేవంత్ రెడ్డి విషెస్

image

పట్టభద్రుల MLCగా గెలుపొందిన తీన్మార్ మల్లన్నకు ట్విటర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. తీన్మార్ మల్లన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలపై ప్రశ్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఇదే స్థానంలో గెలిచిన పల్లారాజేశ్వర్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇచ్చారు.

News June 8, 2024

‘2009 నుంచి బీజేపీ గెలవలేదు’

image

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపై కాషాయజెండా ఎగరవేయాలని నాయకులు 2009 నుంచి ప్రయత్నిస్తున్నారు. 2009లో బీజేపీ నుంచి పోటీచేసిన చింతా సాంబమూర్తి నామమాత్రపు పోటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో TDPతో కలిసి పోటీ చేసిన పార్టీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డి శ్రమించినా ఫలితం దక్కలేదు. 2019లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పీవీ శ్యామ్‌సుందర్‌రావు ఓటమిపాలయ్యారు, ప్రస్తుతం నర్సయ్య ఓటమితో బీజేపీకి నిరాశే మిగిల్చింది.

News June 8, 2024

మూడు రోజుల పాటు నానా అవస్థలు

image

పట్టభద్రుల MLC ఉపఎన్నిక లెక్కింపు 60 గంటలకు పైగా సాగింది. కౌంటింగ్‌లో మొత్తం 52మంది అభ్యర్థులు, 3వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 12 గంటల పాటూ ఏకధాటిగా విధుల్లో ఉండడంతో అలసిపోయారు. గోదాముల్లో కూలర్లు ఏర్పాటు చేసినా అక్కడి ఉక్కపోతతో కొంతమంది డీ హైడ్రేషన్‌కు గురయ్యారు. గతంలో 56 టేబుళ్లపై లెక్కించగా.. ఈ దఫా 96టేబుళ్లపై ఓట్లను లెక్కించిన ప్రక్రియ ఆలస్యమవడంతో అవస్థలు పడినట్లు తెలిపారు.

News June 8, 2024

ఓటమిని అంగీకరిస్తున్నా: రాకేశ్ రెడ్డి

image

WGL-KMM-NLG BRS ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఓటమిపై స్పందించారు. ఓటమిని అంగీకరించినట్లు ప్రకటించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు.. కానీ, నైతికంగా గెలిచానని అన్నారు. పన్నెండేళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నానని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులందరూ తనకు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పట్టభద్రుల కొసం ప్రజా క్షేత్రంలో పోరాడుతానని పేర్కొన్నారు.

News June 8, 2024

NLG: అంగన్వాడీల్లో ఆంగ్లంలో బోధన..!

image

ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఆంగ్లంలో బోధన చేయనున్నారు. ఈ సందర్భంగా మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాల్లో యూకేజీ, ఎల్కేజీకి సంబంధించిన పుస్తకాలు, నోట్బుక్స్ తో పాటు యూనిఫాం కూడా అందించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

News June 7, 2024

బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్.. ఆధిక్యంలో మల్లన్న

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ లో BJPఅభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఎన్నికల అధికారులు ఎలిమినేషన్ చేశారు. కాగా ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. BJP అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,709 ఓట్లు, BRS అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,846 ఓట్లు రాగా.. మొత్తంగా మల్లన్న 19వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు ఎవరిదో తెలియనుంది.

News June 7, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఫలితం సాయంత్రం తర్వాతే..!

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఫలితం సాయంత్రం తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాతే ఫలితంపై స్పష్టత రానుంది. ఇప్పటికే 40 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ కాగా, రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుస్తామని తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి ఎవరికి వారే ధీమగా ఉన్నారు.