Nalgonda

News June 5, 2024

ఎమ్మెల్సీ కౌంటింగ్.. తీన్మార్ మల్లన్న ముందంజ..!

image

ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున పోల్ అయినప్పటికీ అవి చెల్లుబాటు కాలేదు. దీంతో రాకేష్ రెడ్డి కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News June 5, 2024

BREAKING.. ప్రారంభమైన MLC ఓట్ల లెక్కింపు

image

నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో రౌండ్‌లో 96 టేబుళ్లపై 96 వేల ఓట్లు లెక్కించనున్నారు. కాగా, తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 4రౌండ్ల‌లో పూర్తి కానుంది. మొత్తం 3,36,013 ఓట్లు పోలవగా.. అందులో 2139 ఓట్లు పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లున్నాయి. అర్ధరాత్రిలోపు తొలిప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

News June 5, 2024

నల్గొండ, భువనగిరిలో BRSను వెనక్కి నెట్టిన BJP

image

నల్గొండ, భువనగిరి రెండు లోక్‌సభ స్థానాల్లో గతంతో పోలిస్తే భాజపాకు గణనీయమైన ఓట్లు వచ్చాయి. నల్గొండ, భువనగిరి నుంచి పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌ రెండింటిలోనూ భారాస అభ్యర్థులను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలవడం విశేషం. నల్గొండలో శానంపూడికి 2,24,421 ఓట్లు రాగా, భువనగిరిలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 3,32,467 ఓట్లు పెరగడం విశేషం.

News June 5, 2024

నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన కాంగ్రెస్ MP ఎన్నికల్లోనూ NLG, BNRలో విజయం సాధించి నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపించింది. నల్గొండలో 5.59లక్షల మెజార్టీ రాగా, భువనగిరిలో 2లక్షల పైచిలుకు మెజార్టీ వచ్చింది. BNRలో రాజగోపాల్ రెడ్డి అన్నితానై నడిపించగా, NLG ఇన్‌ఛార్జీగా ఉత్తమ్ తీవ్రంగా శ్రమించారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న HNRలో హస్తం పార్టీకి లక్షకు పైగా మెజార్టీ వచ్చింది.

News June 5, 2024

నల్లగొండ: కొనసాగుతున్న కౌంటింగ్

image

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రధాన అభ్యర్థులుగా రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్), తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్) ప్రేమేందర్ రెడ్డి (బీజెపి), అశోక్ (స్వతంత్ర) బరిలో ఉన్నారు. మంగళవారం వెల్లడైనా నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్లలో బీజేపీ రెండో స్థానంలో నిలవడంతో ఎమ్మెల్సీ ఫలితం ఆసక్తిరేపుతోంది.  

News June 5, 2024

భువనగిరి: ఫస్ట్ టైం పోటీ చేస్తే గెలిచినట్టే..

image

2009లో నూతనంగా ఏర్పాటైన భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొలిసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్ గెలిచారు. 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. వీరంతా మొదటిసారి పోటి చేసి గెలుపొందిన వారే.

News June 5, 2024

బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం

image

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహపరిచాయి. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మూడో స్థానానికి వెళ్లడంతో పార్టీ శ్రేణులల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. నల్గొండ ఎంపీ అభ్యర్థికి 2,18,417 ఓట్లు రాగా, భువనగిరిలో పోటీ చేసిన అభ్యర్థికి 2,56,187 ఓట్లు వచ్చాయి.

News June 5, 2024

అన్న ఎంపీ, తమ్ముడు ఎమ్మెల్యే

image

ఒకే ఇంటి నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులుగా విజయం సాధించారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి చిన్న కుమారుడు అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలుపొందగా, పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా 5,59,906 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు.

News June 5, 2024

జగన్ రికార్డును బ్రేక్ చేసిన రఘువీర్ రెడ్డి

image

భారీ మెజార్టీతో గెలిచిన రఘువీర్ గతంలో జగన్ సాధించిన రికార్డును బద్దలు కొట్టారు. 2011లో కడప MP స్థానానికి జరిగిన బై పోల్‌లో జగన్ మెజార్టీ 5,45,672. ఆ రికార్డును తిరగరాస్తూ రఘువీర్ 5,59,905 లక్షల మెజార్టీ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీ మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావు పేరిట ఉంది. 1991లో నంద్యాల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన 5.8 లక్షల పైచిలుకు ఓట్లు సాధించారు.

News June 5, 2024

నోటాకు ఎన్ని ఓట్లంటే?

image

లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ,భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 6086 ఓట్లు పోలవగా భువనగిరిలో 4646 ఓట్లు పోలయ్యాయి. కాగా నల్గొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి 60.5% ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై గెలుపొందారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ 44.89% ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై గెలుపొందారు.