Nalgonda

News June 4, 2024

చామలకు ధ్రువీకరణ పత్రం అందజేసిన కలెక్టర్ 

image

భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా ధ్రువీకరణ పత్రాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ జండగే అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

News June 4, 2024

రఘువీర్, చామల తొలిసారి గెలుపు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. నల్గొండ పార్లమెంట్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి ఐదు లక్షల 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి రెండు లక్షల 44 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ తొలిసారి ఎంపీ అభ్యర్థులుగా గెలుపొందారు. తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.

News June 4, 2024

గెలుపొందిన సర్టిఫికెట్ అందుకున్న రఘువీర్ రెడ్డి 

image

నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికిఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ , మాణిక్ రావు, సూర్యవంశీ , జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సర్టిఫికెట్ అందజేశారు. మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి వారితో ఉన్నారు. 

News June 4, 2024

నల్గొండ నా బలం.. నల్గొండ నా బలగం: కోమటిరెడ్డి

image

నల్గొండలో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై నమ్మకంతో రఘువీర్‌ను అఖండ మెజార్టీతో గెలిపించిన నల్గొండ ప్రజానీకానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ కష్టసుఖాల్లో అండగా ఉంటానని మాటిస్తున్నానని తెలిపారు. ఇది నల్గొండ ప్రజల, కాంగ్రెస్ కార్యకర్తల కష్టఫలమని చెప్పారు. ‘నల్గొండ నా బలం బలగం’ అంటూ ట్వీట్ చేశారు.

News June 4, 2024

ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించిన కలెక్టర్లు

image

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా అనిశెట్టి దుప్పలపల్లి కౌంటింగ్ కేంద్రంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావుతో కలిసి నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజక వర్గాల కౌంటింగ్ ను ప్రత్యేకంగా ఆ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.

News June 4, 2024

2,55,082 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ముందంజ

image

నల్గొండ పార్లమెంట్ 17వ రౌండ్ ఫలితాలు వెలువడే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 2,55,082 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఈ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి 3,78,649 ఓట్లు రాగా
బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 1,23,567 ఓట్లు వచ్చాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి 1,04,457 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

News June 4, 2024

MP RESULTS: మొదట నల్గొండ, తర్వాత భువనగిరి

image

NLG, BNR లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. MLGలో తొలుత లెక్కింపు పూర్తవనుండగా.. ఆ తర్వాత వరుసగా SRPT, NLG, KDD, HNR, సాగర్‌ చివరగా DVK ఓట్ల లెక్కింపు పూర్తవనుంది. BNR లోక్‌సభ పరిధి ఇబ్రహీంపట్నంలో 343 పోలింగ్‌ స్టేషన్లుండగా .. ఇక్కడ 20 టేబుళ్లను, మునుగోడు, తుంగతుర్తి, BNR, NKL, ALR, జనగామలో 14 టేబుళ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మొదట నల్గొండ, తర్వాత భువనగిరి ఎంపీ ఎవరో తేలనుంది.

News June 4, 2024

24 రౌండ్స్‌లో పూర్తికానున్న నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్

image

నల్గొండ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు 24 రౌండ్స్ లో పూర్తి కానుంది. కౌంటింగ్ కోసం మొత్తం 8 హాల్స్ 122 టేబుల్ ఏర్పాటు చేశారు. 2061 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నారు. నల్లగొండ పార్లమెంట్ ‌లో 74.02 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 17,25,465 మంది ఓటర్లకు గాను 12,77,137 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

News June 3, 2024

చామల.. బూర.. క్యామ.. వీరిలో మన MP ఎవరు?

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపే వెలువడనుండడంతో భువనగిరి ఎంపీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ BRS నుంచి క్యామ మల్లేశ్, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, BJP నుంచి బూర నర్సయ్య పోటీలో ఉన్నారు. కాగా భువనగిరి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్లు స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. చాలా సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించాయి.

News June 3, 2024

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం : కేటీఆర్

image

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ <<13368558>>హిందూపూర్ వాటర్ ట్యాంక్‌లో <<>>మృతదేహం లభించిన ఘటనపై ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విటర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు.